సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఒకటి, రెండు రోజులు లేటైనా ఇప్పుడు దాదాపు అన్ని సినిమాలు నెలలోపే డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అలా గత నెలలో బిగ్ స్క్రీన్ పై రిలీజైన ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్నారు. అలాగే థియేటర్లలో చూసిన వారు కూడా మరోసారి ఈ మూవీని వీక్షించాలని అనుకుంటున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఊరిలో భార్యలందరూ సీరియల్స్‌కు బాగా అలవాటు పడిపోతారు. సాధారణ వేళల్లో భర్తలను దేవుళ్లుగా భావించే భార్యలు సీరియల్స్ చూసే సమయంలో దయ్యాలుగా మారి పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తారు. దీంతో ఊర్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. దీంతో బాధితులంతా పరిష్కారం కోసం ఓ మాత దగ్గరికి వెళ్తారు. మరి ఈ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా? అసలు ఆ మహిళలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత ఈ సినిమాను నిర్మించింది.
ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు శుభం. స్టార్ హీరోయిన్ సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన మొదటి సినిమా ఇది. ఆమె కూడా ఓ కీలక పాత్ర పోషించింది. సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, చరణ్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతం, షాలిని కొండేపూడి, శ్రావణి లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. జూన్ 13న శుభం సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ‘జియో హాట్‌స్టార్‌లో జూన్ 13న కథ ఆరంబం. చచ్చినా చూడాల్సిందే’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా శుభం ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..
This June 13th, katha aarambham on JioHotstar 💫
Chacchina choodalsindhe 👀 #SubhamOnJioHotstar #Subham @Samanthaprabhu2 @TralalaPictures #JioHotstar pic.twitter.com/If7zN9utiY
— JioHotstar Telugu (@JioHotstarTel_) June 1, 2025