ఓటీటీలో పాపులర్ ఫ్రాంఛైజీ వెబ్ సిరీస్ అదరగొడుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు పార్ట్ లు రాగా ఇటీవలే మూడో సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. యూత్ ఫుల్ రొమాంటిక్ గా తెరకెక్కిన ఈ సిరీస్ రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్ తో దూసుకెళుతోంది. ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ కు గత సీజన్ల కంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. మూడో సీజన్ కు మొదటి వారంలోనే 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంటేప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది ఈ వెబ్ సిరీస్ ను వీక్షించారన్నమాట. సీజన్ 2 తో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువని ఓటీటీ సంస్థ పేర్కొంది. జూన్ 2022 లో ఫస్ట్ సీజన్ స్ట్రీమింగ్ కు రాగా, జూలై 2023 లో ఈ సిరీస్ రెండవ సీజన్ విడుదలైంది. సెకెండ్ సీజన్ మొదటి వారంలో 17.9 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఈ రికార్డును మూడో సీజన్ బద్దలు కొట్టింది. అలాగే మొదటి సీజన్ మొదటి వారంలో వచ్చిన దానికంటే తాజా గణాంకాలు దాదాపు మూడు రెట్లు ఎక్కువని రిపోర్టులు చెబుతున్నాయి. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. సమ్మర్ వెకేషన్ కోసం వెళ్లిన అమ్మాయికి.. అక్కడ ఇద్దరు అబ్బాయిలతో లవ్, రిలేషన్ షిప్, బ్రేకప్.. ఇలా యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ కంటెంట్ తో తెరకెక్కడంతో ఈ సిరీస్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. పైగా ఇందులో హాట్ సీన్స్ కూడ బాగానే ఉన్నాయి. బెల్లీ, జెర్మియా, కాన్రాడ్ అనే మూడు పాత్రల మధ్య నడిచే ఈ రొమాంటిక్ స్టోరీలో ట్విస్టులు కూడా బాగానే ఉన్నాయి.
ఈ రొమాంటిక్ అండ్ బోల్డ్ వెబ్ సిరీస్ పేరు.. ‘ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెటీ సీజన్ 3. ఇందులో లోలా తుంగ్, జాకీ చుంగ్, రాచెల్ బ్లాంచర్డ్, క్రిస్టోఫర్ బ్రినీ, గావిన్ కాసలెగ్నో, సీన్ కౌఫ్మన్, ఆల్ఫ్రెడో నార్సిసో తదితరులు నటించారు . జెన్నీ హాన్ రాసిన అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ లో ప్రతి వారం ఒక కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వస్తుంది. కాగా పేరుకు తగ్గట్టుగానే ఈ రొమాంటిక్ అండ్ బోల్డ్ సిరీస్ లో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి పిల్లలతో కలిసి అసలు చూడొద్దు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..