One Plus 12: వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు.. ఆ రెండు సైట్స్‌లో ప్రత్యేకం

One Plus 12: వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు.. ఆ రెండు సైట్స్‌లో ప్రత్యేకం


One Plus 12: వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు.. ఆ రెండు సైట్స్‌లో ప్రత్యేకం
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

ప్రస్తుతం భారతదేశంలోని ఈ-కామర్స్ సైట్స్‌లో ఫెస్టివల్ సేల్స్ హడావుడి నెలకొంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో పాటు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ హవా నడుస్తుంది. ఈ సేల్‌లో వివిధ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో వన్ ప్లస్ 12 ఫోన్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. గత దీపావళి సేల్‌లో కూడా అమెజాన్ ఇలాంటి మంచి డీల్స్‌ను అందించిన విషయం తెలిసిందే. అలాగే విజయ్ సేల్స్ 2024 వన్ ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై మంచి తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. తాజా వన్ ప్లస్ 12 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

వన్ ప్లస్ 12 ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ. 62,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది దాని అసలు ప్రారంభ ధర రూ. 64,999 నుండి తగ్గింది. అంటే వినియోగదారులకు రూ.2,000 తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా విజయ్ సేల్స్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 7,000 తక్షణ తగ్గింపును కూడా ఇస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.55,999కు లభిస్తుంది. అలాగే అమెజాన్‌లో వన్ ప్లస్ 12 దాని అసలు ధర రూ. 64,999 వద్ద ఉంది. అయితే రూ.2,000 కూపన్‌తో ఈ ఫోన్ ధర రూ.62,999కి తగ్గుతుంది. దీని కోసం మీరు అమెజాన్‌లో వన్ ప్లస్ 12 లిస్టింగ్‌లో కనిపించే కూపన్ బాక్స్‌ను టిక్ చేయాలి. తగ్గిన మొత్తం చెక్అవుట్ పేజీలో కనిపిస్తుంది. అదనంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ. 5,750 తక్షణ తగ్గింపు కూడా ఉంది. దీంతో ఈ ఫోన్ రూ. 57,249కు పొందవచ్చు. ఈ ధర నేపథ్యంలో విజయ్ సేల్స్  వన్ ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై మరింత మెరుగైన డీల్‌ను అందిస్తోంది. 

ఈ డీల్ విజయ్ సేల్స్ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉందో? లేదో? ప్రస్తుతం తెలియదని నిపుణులు చెబుతున్నారు. అయితే వినియోగదారులు ఈ ఆఫర్ ఆన్‌లైన్‌లో అందుబాటులోఉంటుంది. అలాగే వన్ ప్లస్ ఫోన్‌పై మరిన్ని తగ్గింపులను పొందడానికి వినియోగదారులు ఎక్స్ఛేంజ్ డీల్‌లను క్లెయిమ్ చేయడాన్ని కూడా పరిగణించవచ్చు. అయితే అమెజాన్‌లో ఫోన్ కొనుగోలుతో రూ.7,999 ధరతో వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 ఉచితంగా పొందవచ్చు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *