OG Movie: పవన్ ఓజీ లో విలన్ రోల్‌ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? చేసుంటే బాక్సాఫీస్ బద్దలయ్యేది

OG Movie: పవన్ ఓజీ లో విలన్ రోల్‌ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? చేసుంటే బాక్సాఫీస్ బద్దలయ్యేది


ఇటీవల హరి హర వీరమల్లు సినిమతో ఫ్యాన్స్ ను అలరించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. త్వరలోనే ఓజీ అంటూ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. సుజిత్ తెరకక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఓజీ సినిమాలో ప్రియా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి, వెంకట్, ప్రకాశ్‌ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, మైమ్ గోపీ ఇలా చాలా మంది నటీ నటులు ఈ మూవీలో భాగమయ్యారు. తమన్ స్వరాలు అందించారు. ఇప్పటికే ఓజీ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్, సాంగ్ పవన్ ఫ్యాన్స్ కు అమితంగా నచ్చేశాయి. ముఖ్యంగా రీసెంట్ గానే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫైర్ స్ట్రోమ్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను కొల్లగొట్టేస్తోంది. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఓజీ సినిమా కోసం ముందుగా బలమైన స్టార్ క్యాస్ట్ ను అనుకున్నారట మేకర్స్. అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, టబు, టొవినో థామస్ ఇలా స్టార్ నటీ నటులందరినీ వివిధ పాత్రల్లోకి తీసుకోవాలనుకున్నారట. అయితే ఆ తర్వాత వివిధ కారణాలతో ఓజీ క్యాస్టింగ్ మొత్తం మారిపోయిందట. అందులో ప్రధానంగా మెయిన్ విలన్ రోల్. మొదటగా రోల్ కోసం కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన రక్షిత్ శెట్టి ని తీసుకుందామని అనుకున్నారుట. కానీ ఎందుకో కుదరలేదట. దీంతో చివరకు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీని ఫైనల్ చేశారట. ఈ విషయం తెలిసిన సినీ అభిమానులు షాక్ అవుతున్నారు. రక్షిత్ శెట్టి విలన్ గా చేసి ఉంటే ఓజీ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేదంటూ తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *