
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో విచిత్ర కేసు వెలుగుచూసింది. గంజాయి అమ్ముతూ పోలీసులకు గుర్రం పట్టబడింది. గుర్రాన్ని పోలీస్ స్టేషన్‌కి తరలించారు పోలీసులు. గుర్రమేమిటి గంజాయి అమ్మడం ఏంటి అనుకుంటున్నారా…! అవునండి నిజమేనండి బాబు.. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి పోలీసులు గంజాయి అమ్మేందుకు సహకరిస్తుందని గుర్రాన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇఫ్పుడు దానికి రోజూ దాణా, గడ్డి తెచ్చిపెడుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో ఒక చోట కొందరు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అంతే పోలీసులను చూసి అక్కడున్నవారంతా పరారయ్యారు. ఐతే అక్కడే ఉన్న గుర్రం మాత్రం దొరికింది. గుర్రమైతే మాకేంటి ఇది కూడా గంజాయి తాగుతున్న వారితో స్నేహం చేసింది. వారికి సహకరించిందని గుర్రాన్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం వత్సవాయి పోలీస్ స్టేషన్ లో ఈ గుర్రాన్ని కట్టేసి సకల మర్యాదలు చేస్తున్నారు. గుర్రంపై స్వారీ చేస్తూ గంజాయి రవాణా చేస్తున్నారన్నది దానిపై అభియోగం.
గుర్రం యజమానికి గంజాయి అమ్మకాలపై సంబంధం ఉన్నదా..? గంజాయి రవాణా చెయ్యడానికి పోలీసులకు అనుమానం రాకుండా గుర్రాన్ని వాడుతున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్ానరు. మొత్తానికి గంజాయి అమ్మకంలో సహకరిస్తుందని అశ్వాన్ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..