అంతా ప్లాన్ చేసిన ప్రకారమే చేయాలనుకుంటాం. కాకపోతే కొన్నిసార్లు అటూ ఇటూ అవుతుంటాయి. తారక్ కెరీర్లోనూ ఇప్పుడు కరెక్ట్ గా అలాంటి ఫేజ్ కనిపిస్తోంది.
దేవర అండ్ వార్ మధ్య ఆయన జాగ్రత్తగా చేసుకున్న ప్లానింగ్ కాస్త అటూ ఇటూ కావడంతో, ఇప్పుడు తారక్ కంప్లీట్‌గా నార్త్ లోనే ఉంటున్నట్టు అనిపిస్తోంది.
ఇంతకీ అదే నిజమా.? దేవర సినిమాను చెప్పిన డేట్‌కి రిలీజ్ చేయాలని… ఎట్ ఎ స్ట్రెచ్ కాల్షీట్లు ఇచ్చేశారు తారక్. దాంతో ఆయన వార్2 పోర్షన్ కాస్త పెండింగ్ పడింది.
ఇప్పుడు ఆ షూట్ చేస్తున్నారు వార్2 మేకర్స్. ఓ వైపు క్లైమాక్స్ షెడ్యూల్, ఇంకోవైపు తారక్ పోర్షన్ అంటూ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. వార్2 కోసం ఆల్రెడీ ముంబైకి చేరుకున్నారు తారక్.
ఓ వైపు ఆ షూటింగ్ చేస్తూనే, మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా డిస్కషన్స్ లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కోసం కంప్లీట్‌గా కొత్త లుక్‌లోకి వచ్చేయాలి తారక్.
అందుకే ఫిజికల్ ఫిట్‌నెస్‌లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెవర్ బిఫోర్ అవతార్‌లో తారక్‌ని ప్రెజెంట్ చేయాలన్నది ప్రశాంత్ నీల్ ప్లాన్.
ఎన్టీఆర్ నీల్ సినిమా కంప్లీట్ అయ్యాక.. తారక్ నార్త్ లో డైరక్ట్ ప్రాజెక్టులు చేస్తారన్నది ఆల్రెడీ స్ప్రెడ్ అవుతున్న వార్త.
తారక్ కాల్షీట్ల కోసం పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు కూడా వెయిట్ చేస్తున్నాయన్నది నందమూరి సర్కిల్స్ లో జోష్ పెంచుతున్న విషయం.