హైదరాబాద్, మే 22: నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ శ్రేష్ట (NETS 2025) పరీక్ష సమీపిస్తోంది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఇక పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదలకానున్నాయి. జూన్ 1వ తేదీ ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించనుంది.
ఎన్‌ఈటీఎస్-2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మే 27న ఏపీ ఈఏపీసెట్ 2025 అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాథమిక కీ విడుదల..
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన ఆన్సర్ కీ మే 27న విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఆన్సర్ కీ పై మే 31 వరకు అభ్యంతరాలకు తెలపడానికి అవకాశం ఇచ్చింది. జేఎన్‌టీయూకే కాకినాడ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఈఏపీసెట్-2025 అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి మొత్తం 92.39 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ముగిశాయి. బుధవారం (మే22) నుంచి ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మొదలయ్యాయి. ఈ పరీక్షలు మే 27వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి.
ఏపీ ఈఏపీసెట్ 2025 అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.