హైదరాబాద్, మే 1: దేశవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (నీట్ యూజీ 2025) ప్రవేశ పరీక్ష మరో 3 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీట్ యూజీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక మే 4వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మే 4న మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య ఆఫ్‌లైన్ విధానంలో నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఎంబీబీఎస్‌తోపాటు బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షను ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
నీట పరీక్ష రాసే విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు ఉంటుంది. విద్యార్ధులు అడ్మిట్ కార్డులో పేర్కొన్న సూచనలను ఖచ్చితంగా పాటించవల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్‌తోపాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ముఖ్యంగా డ్రెస్ కోడ్‌కు సంబంధించి.. ఫుల్-స్లీవ్ షర్టులు, పెద్ద బటన్లు ఉన్న ప్యాంటు, బూట్లు, సాక్స్, హై-హీల్డ్ చెప్పులు, చెవిపోగులు, గాజులు, గొలుసులు, ముక్కు పిన్నులు, హెయిర్ క్లిప్‌లు వంటి లోహ వస్తువులు ధరిస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను బయటే వదిలేసి రావాలి. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద జామర్‌లను అమర్చడానికి, తనిఖీలు నిర్వహించడానికి NTA ఏజెన్సీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.