Nagarjuna-Venkatesh: నాగార్జున రిజెక్ట్ చేశాడు.. వెంకటేష్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ సినిమానో తెలుసా?

Nagarjuna-Venkatesh: నాగార్జున రిజెక్ట్ చేశాడు.. వెంకటేష్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ సినిమానో తెలుసా?


అన్ని సమయాల్లో హీరోల జడ్జిమెంట్ సరిగ్గా ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. అందుకే సినిమా ఇండస్ట్రీలో కథలు తరచూ చేతులు మారుతుంటాయి. వేరొక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ కావొచ్చు. మరోసారి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడవచ్చు. అలా ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాలో మరొకరు నటించి హిట్ కొడితే మంచి ఛాన్స్ మిస్ అయ్యాడని అభిమానులు ఫీల్ అవుతుంటారు. అదే సినిమా ఫ్లాప్ అయితే రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేశాడని హీరోల అభిమానులు తరచూ అనుకుంటుంటారు. యంగ్ హీరోలే కాదు సీనియర్ హీరోల విషయంలోనూ తరచూ ఇలా జరుగుతుంటుంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున, వెంకటేష్ లది ప్రత్యేక స్థానం. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారీ సీనియర్ హీరోలు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే నాగార్జున రిజెక్ట్ చేసిన ఓ సినిమాతో వెంకటేష్ ఏకంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడట. ఆ మూవీ ఏదో తెలుసా?

సుమారు 25 ఏళ్ల క్రితం రిలీజైన విక్టరీ వెంకటేష్ సినిమా కలిసుందాంరా. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఉదయ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది. అలాగే కళా దర్శకుడు విశ్వనాథ్, శ్రీహరి, రంగనాథ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2000లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో కలిసుందాంరా ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమాలో మొదట హీరో గా వెంకటేష్ ను అనుకోలేదట. నాగార్జున ను హీరోగా తీసుకుందామనుకున్నారట. అందులో భాగంగానే నాగ్ కు వెళ్లి ఈ సినిమా కథ మొత్తాన్ని కూడా వినిపించారట. అయితే ఈ కథ విన్న అక్కినేని హీరో ఈ కథ తనకు వర్కౌట్ కాదన్నాడట. దీంతో మేకర్స్ వెంటనే వెంకటేష్ ను కలిసి కలిసుందాంరా కథను వివరించారట. ఆయనకు ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే ఆ సినిమాలో నటించడానికి ఒకే చెప్పారట. అలా మొత్తానికి నాగ్ మిస్ అయిన కలిసుందాంరా సినిమాతో వెంకటేష్ బ్లాక్ బస్టర్ కొట్టాడట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *