గ్వాలియర్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ లీగ్ (MPL) మంగళవారం నాడు రాబోయే సీజన్‌లో పాల్గొనబోయే 10 ఫ్రాంచైజీల జెర్సీలను ఆవిష్కరించింది. ఈ సీజన్ జూన్ 12న గ్వాలియర్‌లోని శంకర్‌పూర్‌లో ఉన్న శ్రీమంత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. వరుసగా రెండవ సంవత్సరం కూడా, గ్వాలియర్ మొత్తం టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2024లో MPL ప్రారంభ సీజన్‌కు కూడా ఇదే వేదికగా నిలిచింది. ఈ సంవత్సరం జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో పురుషుల, మహిళల జట్ల కొత్త రూపాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, జట్టు అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్వాలియర్ డివిజన్ క్రికెట్ అసోసియేషన్ (GDCA) నిర్వహించిన ఈ పురుషుల పోటీలో, గత సీజన్‌లో ఐదు జట్లు పాల్గొనగా, ఈసారి బుందేల్‌ఖండ్, చంబల్ ప్రాంతాల నుంచి జట్లను చేర్చడంతో 7 కు పెరిగింది.
ఈ సీజన్‌లో మహిళల క్రికెట్ లీగ్ కూడా ప్రారంభం కానుంది. ఇది పురుషుల మ్యాచ్‌లతో పాటు జరుగుతుంది. మహిళల పోటీలో రాజధాని నగరం భోపాల్‌కు ప్రాతినిధ్యం వహించే జట్టుతో సహా మూడు జట్లు సందడి చేయనున్నాయి.
ఇవి కూడా చదవండి
మధ్యప్రదేశ్ లీగ్ జట్ల జెర్సీల గురించి ఛైర్మన్ సింధియా మాట్లాడుతూ, “జెర్సీ ఆవిష్కరణ రాబోయే ఉత్తేజకరమైన సీజన్‌కు నాంది పలుకుతుంది. మధ్యప్రదేశ్ లీగ్ క్రికెట్ ప్రతిభ, ప్రాంతీయ గర్వానికి వేడుకగా నిలిచింది. ఈ సంవత్సరం మేం లీగ్‌ను విస్తరించడమే కాకుండా, మహిళల పోటీని కూడా ప్రవేశపెడుతున్నాం, ఇది చేరిక, వృద్ధి పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.”
అదే ఉత్సాహాన్ని ప్రతిధ్వనిస్తూ, GDCA అధ్యక్షుడు ప్రశాంత్ మెహతా మాట్లాడుతూ, “మధ్యప్రదేశ్ లీగ్ సీజన్ 2పై ఆసక్తి పెరిగింది. జట్ల జెర్సీలు వారి ప్రాంతాల స్ఫూర్తిని సూచిస్తాయి, లీగ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన క్రికెట్‌ను అందించి, రాష్ట్రానికి కొత్త ప్రతిభను వెలికితీస్తుందని విశ్వసిస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.
పురుషుల జట్లు:
గ్వాలియర్ చీతాస్ చీతాస్ (Gwalior Cheetahs)
భోపాల్ లెపర్డ్స్ (Bhopal Leopards)
జబల్‌పూర్ రాయల్ లయన్స్ (Jabalpur Royal Lions)
రేవా జాగ్వార్స్ (Rewa Jaguars)
ఇండోర్ పింక్ పాంథర్స్ (Indore Pink Panthers)
చంబల్ ఘరియాల్స్ (Chambal Ghariyals)
బుందేల్‌ఖండ్ బుల్స్ (Bundelkhand Bulls)
మహిళల జట్లు:
చంబల్ ఘరియాల్స్ (Chambal Ghariyals)
భోపాల్ వోల్వ్స్ (Bhopal Wolves)
బుందేల్‌ఖండ్ బుల్స్ (Bundelkhand Bulls)
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..