మహాకుంభ్ లో పూల దండలు అమ్మిన మోనాలిసా తన అందంతో రాత్రికి రాత్రే ఫేమస్ అయింది. ఆ సమయంలో కొందరు ఫొటో గ్రాఫర్లు తీసిన మోనాలిసా వీడియోలు, ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఒకప్పుడు రోడ్డు మీద పూసల దండలమ్ముతూ పేదరికంలో జీవించిన మోనాలిసా జాతకం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మ్యూజిక్ వీడియోలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా బాగా సంపాదిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ మోనాలిసా యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తోంది. దీంతో నెట్టింట ఈ ముద్దుగుమ్మకు రోజు రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. మోనాలిసా తొలి మ్యూజిక్ వీడియో ఇటీవలే విడుదలైంది. ఇందులో ఆమె నటుడు ఉత్కర్ష్ సింగ్ మోనాలిసాతో కలిసి నటించింది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక మ్యూజిక్ వీడియో హిట్ అయిన తర్వాత మోనాలిసా బ్రాండ్ ప్రమోషన్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పుడీ అందాల తార పలు బ్రాండ్లకు ప్రమోషన్లు కూడా చేస్తోంది. ఇందుకు గానూ ఒక్కో యాడ్ కోసం లక్షల రూపాయలు తీసుకుంటోందని సమాచారం.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మోనాలిసా తన ఆదాయం గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘మహాకుంభమేళా, గంగమ్మ తల్లి దయతో నాకు కొంచెం డబ్బు వస్తోంది. అంతేకానీ చాలా మంది అనుకుంటున్నట్లు నేను కోట్లు సంపాదించడం లేదు. కాగా ఇప్పుడు మోనాలిసా అందం గురించి ప్రతి చోటా చర్చ జరుగుతోంది. ఆమె ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మోనాలిసా కష్టపడి పనిచేసే అమ్మాయి అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇప్పుడు మోనాలిసా సినిమా ప్రాజెక్ట్ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తోన్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంతో మోనాలిసా త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. దీంతో పాటు కొన్ని ఓటీటీ సంస్థలు కూడా తమ ఒరిజినల్స్, వెబ్ సిరీస్ ల కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.
మోనాలిసా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో నిత్యం తన ఫోటోలు మరియు వీడియోలను పోస్ట్ చేస్తుంది. దీంతో రోజు రోజుకూ ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.