మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు రవితేజ. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సినిమాలు చేస్తున్నా కూడా అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయినా కూడా రవితేజ వెనకాడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం రవితేజ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకులు అలరించడానికి రెడీ అవుతున్నాడు మాస్ రాజా.. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లో రవితేజ డబుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి : నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు
ఫ్యాన్స్ రవితేజను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో ఆయన అలా కనిపిస్తున్నారు. కాగా మరోసారి రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ లో యాక్షన్ సీన్స్ తోపాటు రవితేజ మార్క్ కామెడీ కూడా కనిపిస్తుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. రవితేజ, రాజేంద్ర ప్రసాద్ కాంబో సీన్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా
మాస్ జాతర సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా మాస్ జాతర వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రానుంది. ఇక ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి