Manchu Manoj: కన్నప్ప హార్ట్ డిస్క్ మీ దగ్గరే ఉందటగా.. ? మంచు మనోజ్ ఆన్సర్ ఇదే..

Manchu Manoj: కన్నప్ప హార్ట్ డిస్క్ మీ దగ్గరే ఉందటగా.. ? మంచు మనోజ్ ఆన్సర్ ఇదే..


మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ కన్నప్ప. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా హార్ట్ డిస్క్ మిస్సింగ్ వ్యవహారం ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాయమైన హార్డ్ డిస్క్ లో సినిమాలోని కీలకఅంశాలు, ముఖ్యంగా ప్రభాస్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరిగింది. మంచు విష్ణు ఆఫీస్ లో పనిచేసే చరిత అనే యువతి కన్నప్ప హార్డ్ డిస్క్ తీసుకుని పరారైందని ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల చెన్నైలో జరిగిన సినిమా ప్రచారంలో మంచు విష్ణు స్పందిస్తూ.. తన సోదరుడు మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు. వారే స్వయంగా చేశారా.. ? లేక వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదని విష్ణు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ విషయంపై మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఆయన నటించిన లేటేస్ట్ మూవీ భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటించిన చిత్రం భైరవం. ఇందులో అదితి సంకర్, ఆనంది, దివ్య పిళ్లై కీలకపాత్రలు పోషించారు. మే 30న విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కన్నప్ప హార్డ్ డిస్క్ మీ దగ్గరే ఉందటగా ? అని ఓ విలేకరి అడగ్గా.. మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

కన్నప్ప హార్డ్ డిస్క్ పోయింది.. మీకు సంబంధం ఉంది అనే వార్తలు వస్తున్నాయి కదా అని మనోజ్ ను అడగ్గా.. “నేను మీకే ఇచ్చాను కదా.. మర్చిపోయారా మీరు మొన్న కలిసినప్పుడు ఇచ్చాను కదా” అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చారు. ఒక సినిమా సినిమా అనేది చాలా మందికష్టం.. అందుకే తాను కన్నప్ప సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *