కుంకుమ హిందువులకు చాలా పవిత్రమైనది. పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు, ఫంక్షన్లు వేటిల్లోనైనా కుంకుమని తప్పని సరిగా ఉపయోగిస్తారు. హిందు సంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా నుదురు మీద కుంకుమని బొట్టుగా ధరిస్తారు. అంతేకాదు పెళ్ళిళ్ళు పేరంటాల్లో మహిళల నుదిటిన కుంకుమని దిద్దుతారు.పెళ్ళైన మహిళలు ఇంటికి వచ్చి వెళుతున్నపుడు పెద్దవారైతే గౌరవసూచకంగా, చిన్న వారైతే దీవెనగా కుంకుమ బొట్టు పెట్టి సాగనంపడం ఆనవాయితీ. అటువంటి కుంకుమని ఈ రోజు ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా అన్నది తెలుసుకుందాం..
ఇంట్లో కుంకుమ తయారీకి కావాల్సిన పదార్థాలు 3 టీస్పూన్ల పసుపు పొడి, 1.5 టీస్పూన్ల పటిక , 0.5 టీస్పూన్ నిమ్మరసం తీసుకోండి. వీటిని మిక్సీలో వేసి బాగా మిక్స్ చేసుకుని చిక్కటి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మృదువుగా చేయడానికి కొంచెం నెయ్యి జోడించాలి.
కుంకుమ ఎరుపు రంగు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ పటిక, నిమ్మరసం జోడించవచ్చు. ఇలా తయారుచేసుకున్న కుంకుమపువ్వును ఒక చిన్న సీసాలో నిల్వ చేసి రెండు వారాల వరకు ఉపయోగించవచ్చు. ఇది సహజంగా తయారు చేసిన కుంకుమ కనుక దీనిని ఉపయోగించడం వలన దుష్ప్రభావాలు ఉండవు.
సహజమైన పదార్ధాలతో ఇంట్లోనే సహజంగా తయారుచేసిన కుంకుమను రెండు వారాల వరకు శుభ్రంగా .. సురక్షితంగా ఉపయోగించవచ్చు.
కుంకుమ పొడిని నెయ్యి జోడించి తయారు చేయడం వలన కుంకుమ తేలికపాటి సువాసనతో ఉంటుంది. కుంకుమను సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు.
ఇది సాంప్రదాయ హిందూ సంస్కృతిలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. దీనిని మహిళలకు నుదిటి మీద ధరిస్తారు. పూజ సమయంలో దేవతలకు నైవేద్యంగా ఉపయోగిస్తారు. కుంకుమ ఆధ్యాత్మిక గుర్తింపుకు చిహ్నంగా, శుభ సంఘటనలకు సూచికగా .. ఆశకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.
అయితే ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతున్న కుంకుమని కుంకుమ రాళ్ళతో తయారు చేస్తారు. పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి..దంచి తెల్లనిబట్టతో జల్లిస్తారు. ఈ పొడిలో నూనె లేదా నెయ్యి కలుపుతారు.
బజారులో దొరికే కుంకుమ ఇదే.