తామర గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉండి, సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా పూల్మఖానీ మంచి ప్రయోజనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూల్ మఖానాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అరటి పండు తిన్నంత బలం దీనికి వస్తుంది.
మఖానాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆటోమేటిగ్గా బరువు తగ్గుతుంది. ఇందులోని ప్రోటీన్ కారణంగా ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఆకలి కంట్రోల్ అవుతుంది. ఫైబర్ మీ జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేసేలా చేస్తుంది. దీంతో తక్కువగా తింటారు. బరువు, బెల్లీ తగ్గుతుంది.
గర్భిణులకు, బాలింతలకు సైతం ఫూల్ మఖానా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు..ముఖ్యంగా ఇది రక్తహీనతతో బాధపడుతున్న వారికి మేలు చేస్తుంది. రక్తం కొరతను తీరుస్తుంది. ఇవి తింటే ఆకలి పెరుగుతుంది. అలాగని బరువు పెరిగే అవకాశం ఉండదు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి.
యాంటీ ఆక్సిడెంట్లలో ముఖ్యమైన గాలిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి. అయితే వీటిని నూనెలో వేయించకుండా, నేరుగా కళాయిలో వేయించుకుని తినాలి. పచ్చివి తిన్నా చర్మానికి మంచిదే.
పూల్ మఖానాలో హానికారక శాచురేటెడ్ కొవ్వు తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటుంది.. మలబద్ధకం సమస్య కూడా రాదు. ఫూల్ మఖానాతో వండిన వంటల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి కాస్త తిన్నా పొట్ట నిండిన భావన వస్తుంది.