మహామృత్యుంజయ మంత్రం మనస్సు, శరీరం, ఆత్మకు శాంతిని అందించే మంత్రం. ఇది అపారమైన శక్తులు కలిగిన శివుని మంత్రం. ఈ మంత్రం శక్తితో మరణాన్ని కూడా జయించవచ్చని నమ్ముతారు. దీర్ఘాయువు పొందడానికి, అకాల మరణాన్ని నివారించడానికి ఈ మంత్రాన్ని జపిస్తారు. ఈ మంత్రం అనేక ఇతర ప్రయోజనాలను గురించి ఋగ్వేదంలో కూడా ప్రస్తావించారు. ఈ మంత్రం మిమ్మల్ని విశ్వ శక్తితో అనుసంధానిస్తుంది. మిమ్మల్ని శివుడితో కలుపుతుంది. అయితే మహా మహిమనిత్వం అయిన మహామృత్యుంజయ మంత్రం ఎక్కడి నుంచి ఉద్భవించిందో తెలుసుకుందాం..
మహామృత్యుంజయ మంత్రం మూలం
ఋగ్వేదంలోని ఏడవ మండలం, 59వ సూక్తం నుంచి మహామృత్యుంజయ మంత్రం మూలానికి సంబంధించిన చరిత్ర లభిస్తుంది. ఈ మంత్రాన్ని బాలుడైన మార్కండేయ ఈ స్తోత్రాన్ని పాడాడు. దీని వివరణ ఋగ్వేదంలో కూడా కనిపిస్తుంది.
ఈ మంత్రం మూలం వెనుక ఉన్న పురాణం
ఈ మంత్రం శక్తి , మూలం వెనుక ఒక ప్రసిద్ధ పురాణ కథ ఉంది. ఈ కథ శివుని గొప్ప భక్తుడు మృకండు మహర్షికి సంబంధించినది. మృకండు ఋషికి సంతానం లేదు, అతని జాతకంలో సంతానం జన్మించే అవకాశం లేదు. అయితే అతను అన్ని నియమాలను మార్చాడు. మృకండు ఋషి శివుడి కోసం తపస్సు చేసాడు. అతని తపస్సుకు శివుడు సంతోషించాడు. శివుని వరంతో మృకండుడికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ బాలుడి మాత్రం అల్పాయుష్కుడు అని చెప్పాడు. అతని జీవితం కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే. ఆ మహర్షి తన కుమారుడికి మార్కండేయుడు అని పేరు పెట్టాడు. ఆ మహర్షి భార్య తన కుమారుడి అల్ప జీవితానికి ఎప్పుడూ బాధపడేది.
ఇవి కూడా చదవండి
బాలుడైన మార్కండేయుడికి అతని తండ్రి శివ మంత్ర దీక్ష ఇచ్చాడు. బాల్యం నుండే అతను శివుడి భక్తుడయ్యాడు. మార్కండేయుడు తన తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆనందంగా మార్చడానికి శివుడి నుంచి దీర్ఘాయుష్షు వరం కోరుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్కండేయుడు శివుడిని పూజించడం ప్రారంభించాడు. శివాలయంలో శివుడి కోసం తపస్సు మొదలు పెట్టాడు.
యమధర్మ రాజునే ఆపిన మంత్రం
16 సంవత్సరాల కాలం ముగిసింది. ఆ బాలుడిని తీసుకురావడానికి యమ ధర్మరాజు తన దూతలను పంపాడు. అయితే బాలుడైన మార్కండేయుడు నిరంతర తపస్సు చేయడం చూసి.. యమదూతలు తిరిగి వెళ్ళిపోయారు. వారు మార్కండేయుడిని తాకడానికి ధైర్యం చేయలేదు. ఈ విషయాన్నీ యమ ధర్మ రాజుకు చెప్పారు. దీంతో యమధర్మ రాజు ఆ బాలుడిని నేనే స్వయంగా తీసుకువస్తానని చెప్పాడు. శివుని తపస్సులో మునిగిపోయి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తున్న మార్కండేయుడిని యమరాజు చేరుకున్నాడు. ఆ బాలుడు యమధర్మ రాజు రావడం చూసి మహామృత్యుంజయ మంత్రాన్ని బిగ్గరగా జపించడం ప్రారంభించి శివలింగానికి అతుక్కుపోయాడు. యమ ధర్మరాజు అతనిని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించగా.. శివుడు యమ ధర్మ రాజుని అడ్డుకున్నాడు. తన భక్తిలో మునిగిన తన భక్తుడినితీసుకుని వెళ్ళడం ఎంత ధైర్యం అని యమరాజును హెచ్చరించాడు. దీంతో యముడు భయంతో “ప్రభూ ప్రజల ప్రాణాలను తీసే ఈ పనిని నాకు అప్పగించావని చెప్పాడు. దీంతో శివుడి ఆగ్రహం తగ్గి.. మార్కండేయుడికి దీర్ఘాయుష్షును అనుగ్రహించాడు.” దీని తరువాత యమధర్మ రాజు “ప్రభూ, నేటి నుండి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠింవారికి నేను హాని చేయనని చెప్పాడు. ఈ విధంగా మహామృత్యుంజయ మంత్రం శక్తితో, మార్కండేయుడు దీర్ఘాయుష్షును పొందాడు. మరణాన్ని కూడా జయించాడు. అప్పటి నుంచి ఈ మంత్రం శక్తి ప్రసిద్ధి చెందింది.
మృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
మహామృత్యుంజయ మంత్రం అర్థం
అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము. పండు తొడిమ నుంచి వేరుపడే విధముగా.. మేము కూడా మరణము నుంచి మర్త్యత్వము నుంచి విడుదల పొందాలి.
మహామృత్యుంజయ మంత్రం ప్రయోజనాలు
మహామృత్యుంజయ మంత్రం ప్రయోజనాలు మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్ర మంత్రం లేదా త్రయంబకం మంత్రం అని కూడా పిలుస్తారు. దీనిని శివుని మూడవ కన్ను శక్తిగా భావిస్తారు.
ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రమాదాలు నివారింపబడతాయి.
అకాల మరణ భయం అంతమవుతుంది.
దీర్ఘాయువు అనే ఆశీర్వాదం లభిస్తుంది.
మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ప్రతికూలత నాశనం అవుతుంది.
అయితే ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడానికి.. దాని శాస్త్రీయ నియమాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
మహామృత్యుంజయ మంత్రాన్ని జపించే ముందు మీరు పవిత్రంగా ఉండటం చాలా ముఖ్యం.
ఇది కుశ ఆసనంపై కూర్చున్నప్పుడు మాత్రమే చేయాలి.
గరిష్ట ప్రయోజనాలను పొందడానికి ఈ మంత్రాన్ని రుద్రాక్ష జపం మీద జపించాలి.
బ్రహ్మముహూర్తంలో దీనిని జపించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
శివ పురాణం ప్రకారం ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించవచ్చు.
మహామృత్యుంజయ మంత్రాన్ని జపించేటప్పుడు తూర్పు ముఖంగా ఉండాలి. వీలైతే, ప్రతిరోజూ ఒకే చోట కూర్చుని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.
ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మనస్సు ఏకాగ్రతతో, స్వచ్ఛంగా ఉండాలి.
ఈ మంత్రాన్ని జపించే రోజుల్లో చెడు విషయాలకు దూరంగా ఉండాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.