వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు తగ్గించాయి. 19 కిలోల సిలిండర్ ధరను రూ.24మేర తగ్గించినట్టుగా దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. రోజువారీ కార్యకలాపాలకు 19 కిలోల LPG సిలిండర్లపై ఆధారపడే రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఇది పెద్ద ఉపశమనంగా చెప్పాలి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో రూ. 1,723.50లు కాగా, కోల్‌కతాలో రూ. 1,826, ముంబైలో రూ. 1,674.50, చెన్నైలో రూ. 1,881, హైదరాబాద్లో రూ. 1969, విజయవాడలో రూ.1880.50లగా ఉంది. ఇకపోతే,ఈ ధరలు ఆయా నగరాలను బట్టి మారుతుంటాయి. ఎందుకంటే, స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు రాష్ట్రాలను బట్టి మారుతాయి.
వాణిజ్య LPG ధరలు వరుసగా మూడవ నెల కూడా తగ్గుతున్నాయి. మే ప్రారంభంలో, చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరను రూ.14.50 తగ్గించాయి. అంతకు ముందు, ఏప్రిల్ 1న కూడా రూ.41 తగ్గించారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి రోజున ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) మరియు వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. ఈ సవరణలు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు మరియు విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గుల ఆధారంగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే, గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు లేదు. మార్చిలో ప్రభుత్వం LPG సిలిండర్ల ధరను రూ.50 పెంచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనల తర్వాత ప్రపంచ ముడి చమురు ధరలు పెరగడం వల్ల వంట గ్యాస్ ధరలు పెరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి