Lord’s Test Day 3: భారత్ ఇంగ్లాండ్ మధ్య మొదటి రెండు టెస్టు మ్యాచులు ప్రశాంతంగా ముగిసాయి. కానీ లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మాత్రం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. మూడో రోజు ఆట చివరిలో జైక్ క్రాలీ సమయం వృథా చేయడంపై వివాదం మొదలైంది. ఈ సంఘటనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. క్రాలీ టైం వేస్ట్ చేయడం తాను చూసిన బెస్ట్ ప్లాన్ అని పేర్కొన్నాడు. అయితే, భారత్ దీనిపై ఫిర్యాదు చేయలేదని ఎందుకంటే రెండో రోజు భారత్ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసిందని మైఖేల్ వాన్ అన్నాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి, భారత బ్యాటింగ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కు వచ్చింది. ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలీ టైం వేస్ట్ చేయడం వల్ల భారత్ ఒక ఓవర్ తక్కువగా వేయాల్సి వచ్చింది. దీంతో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత ఆటగాళ్లు తీవ్రంగా స్పందించారు. భారత్ 387 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత, మూడో రోజు చివరి సెషన్లో రెండు ఓవర్లు వేయడానికి తగినంత సమయం ఉంది. కానీ క్రాలీ గాయం అయినట్లు నటిస్తూ, జస్ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్ వేస్తున్నప్పుడు మూడు సార్లు వెనక్కి జరిగి టైం వేస్ట్ చేశాడు. దీనివల్ల భారత్ కేవలం ఒక ఓవర్ మాత్రమే వేయగలిగింది. ఇంగ్లాండ్ మూడో రోజు తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 2 పరుగులు చేసింది.
మైఖేల్ వాన్ ‘బీబీసీ’ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ.. “ఇది టైం వేస్ట్ చేసేందుకు బెస్ట్ ఉదాహరణ” అని అన్నాడు. తను మాట్లాడుతూ.. “భారత్ ఫిర్యాదు చేయలేదు, ఎందుకంటే రెండో రోజు గిల్ కండరాల గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. కేఎల్ రాహుల్ బయటికి వెళ్లాడు. అతను ఇన్నింగ్స్ ప్రారంభించలేడు” అని చెప్పాడు. వాన్ ప్రకారం.. ఈ రెండు జట్లకూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఏ జట్టు కూడా ఫిర్యాదు చేయలేదు, కానీ అది అద్భుతమైన డ్రామా నాలుగో, ఐదో రోజు ఆట చాలా అద్భుతంగా ఉంటుంది” అని వాన్ అన్నాడు.
ఇంగ్లాండ్ మరో మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ మాట్లాడుతూ.. 1-1తో సమానంగా ఉన్న ఈ సిరీస్‌లో ఇలాంటి డ్రామా అవసరమని అన్నాడు. కుక్ మాట్లాడుతూ.. “అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంది. కానీ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇలాంటి చిన్న చిన్న క్షణాలు ఎప్పుడూ ఉంటాయి. ఒకరితో ఒకరు చాలాసార్లు ఆడినప్పుడు ఇది సాధారణం” అని పేర్కొన్నాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..