శనీశ్వరుడు న్యాయానికి దేవుడు. శనీశ్వరుడు ఎల్లప్పుడూ కర్మ ఆధారంగా తగిన ఫలితాలను ఇస్తాడు. అందుకనే ఇతడిని కర్మ ప్రధాత అని అంటారు. శనీశ్వరుడి ఆగ్రహానికి గురైతే జీవితంలో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఆయన అనుగ్రహం ఎవరిపైన అయినా ఉంటే, విజయం నెమ్మదిగా సొంతం అవుతుంది. అయితే శనీశ్వరుడు ఆగ్రహం ఎన్ని కష్టాలు తెస్తుందో.. ఆయన అనుగ్రహం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇక శనీశ్వరుడిలోని కొన్ని విషయాలను నేర్చుకోవడం.. వాటిని జీవితానికి అన్వయించుకోవడం వలన మంచి జీవితం లభిస్తుంది.
శనీశ్వరుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు:
కష్టాలను ఎదుర్కోవడం: కొన్నిసార్లు శనీశ్వరుడు వలన ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆ కష్టాలు గత కర్మల వల్ల కలుగుతాయి. ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో శనీశ్వరుడు మనకు నేర్పుతాడు. అందువలన కష్టాలను ఎదుర్కోనే కళ మనకు తెలిస్తే.. మనం బలంగా మారవచ్చు.
ఇవి కూడా చదవండి
క్రమశిక్షణ: శనీశ్వరుడు క్రమశిక్షణను కూడా బోధిస్తాడు. ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి? సమయానికి అనుగుణంగా ఏ పనులు చేయాలో శనీశ్వరుడు క్రమశిక్షణ ద్వారా జీవిత పాఠాన్ని నేర్చుకోవచ్చు.
సహనం: మనం శనీశ్వరుడు నుంచి సహనం, పట్టుదల వంటి గుణాలను నేర్చుకోవచ్చు. అదేవిధంగా శనిదేవుడి నుంచి పట్టుదలను పాటంగా నేర్చుకోవచ్చు. అలాగే సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మనం సహనంతో పాటు బాధ్యతను నేర్చుకోవచ్చు.
బాధ్యత: జీవితంలో బాధ్యత తీసుకోవడం చాలా ముఖ్యం. శనీశ్వరుడునుండి మనం బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలో, నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్చుకోవచ్చు.
ఆత్మపరిశీలన: శనీశ్వరుడు ఒక వ్యక్తికి తన తప్పులను, లోపాలను గుర్తించి, ఆ తప్పులను సరిదిద్దుకుని, సానుకూలంగా జీవించే అవకాశాన్ని ఇస్తాడు. అలాగే మనం సరైన మార్గాన్ని అనుసరించాలని, సరైన మార్గాన్ని అనుసరిస్తేనే జీవితంలో మంచి జరుగుతుందని శని నుండి జీవిత పాఠం నేర్చుకోవచ్చు.
కర్మ పాఠాలు: శనీశ్వరుడు కర్మకు సంబంధించినావాడు. కనుక శనీశ్వరుడి కోసం చర్యల పరిణామాలను హైలైట్ చేస్తుంది. మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది. మనం ఎవరికైనా చెడు చేస్తే మనకు చెడు వస్తుంది అనే కర్మ పాఠాన్ని శనీశ్వరుడు నుంచి నేర్చుకోవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు