శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మనకు నీరు, ఆహారం ఎంత ముఖ్యమో సరైన నిద్రకూడా అంతే ముఖ్యం. వైద్య నిపుణుల ప్రకారం.. ఆరోగ్యంగా ఉండటానికి ఒక వ్యక్తి సాధారణంగా 7 నుండి 8 గంటలు నిద్ర అవసరం అవుతుంది. అయితే, వయస్సు, వైద్య పరిస్థితి కూడా నిద్ర పరిమాణంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. మన పడుకున్నప్పుడు సరైన నిద్ర లేకపోవడం కారణంగా ఊబకాయం, నిరాశ, అలసట, బలహీనత, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనేక వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సరైన నిద్ర లేకపోవడం.. మీ రోజువారి పనులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. దీంతో మీరు డేలో చేయాల్సి పనులపై ఎక్కువగా ఫోకస్ చేయలేరు. అయితే ఎలాంటి ప్రధాన వ్యాధులు నిద్ర లేమి ప్రమాదాన్ని పెంచుతాయో అనే విషయానికి వస్తే..
ఇది కూడా చదవండి: ఏంటీ బ్లాక్ కాఫీతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..! తెలిస్తే షాక్ అవుతారు!
నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరుగుతుంది.
నిద్ర లేకపోవడం వల్ల మీ శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావింతం అవుతాయి. ఇది మీ ఆకలిని పెంచుతుంది. మీకు పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది, దీని కారణంగా మీ శరీర బరువు పెరుగుతుంది. దీని కారణంగా మీరు ఊబకాయానికి గురయ్యే అవకాశం ఉంది.
మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్
మీ మానసిక ఆరోగ్యానికి, నిద్రకు మధ్య దగ్గర సంబంధం ఉంటుంది. మనకు సరైన నిద్ర లేకపోవడం వల్ల నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. ఇది మనకు ప్రస్తుతం ఉన్న మానసిక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు, ఎప్పుడూ చిరాకుగా అనిపించడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
ఇది కూడా చదవండి: రాగి పాత్రలో నీరు తాగేటప్పుడు.. ఈ నాలుగు తప్పులు అస్సులు చేయకండి!
గుండె జబ్బుల ప్రమాదం పెరగవచ్చు
సరైన నిద్ర లేకపోవడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది, దీని వలన మీకు గుండెపోటు సమస్యలు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేల మీకు ఇప్పటికే గుండె జబ్బులుతో బాధపడుతూ ఉంటే.. నిద్ర విషయంలో కచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణుల సంప్రదించి. రోజులో మీకు కావాల్సిన సమయం పాటు నిద్రపోవాలి.
ఇది కూడా చదవండి: గుడ్డు vs పనీర్: దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది?.. ఏది తినడం బెస్ట్?
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.