Lifestyle: కాఫీయే కదా అని లైట్ తీసుకోకండి.. రోజుకు రెండు కప్పులు తాగితే మీ ఆయుష్షు డబుల్‌!

Lifestyle: కాఫీయే కదా అని లైట్ తీసుకోకండి.. రోజుకు రెండు కప్పులు తాగితే మీ ఆయుష్షు డబుల్‌!


కాఫీ ప్రియులకు నిజంగా గుడ్‌ న్యూసే ఇది. ఎందుకంటే ఇటీవల కాఫీ ఆరోగ్యానికి మంచిదికాదని ఒకసారి, చాలా మంచిదని మరోసారి ప్రజలను కన్‌ఫ్యూజన్‌లో పడేస్తున్నారు. దీంతో కాఫీ ప్రయులు అసలు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా.. కాదా అనే సందేహంలో పడిపోతున్నారు. ఈ సందిగ్ధంలో తమకెంతో ఇష్టమైన కాఫీని వదులలేక, తాగినా దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. ఇలాంటివారికి అమెరికా సైంటిస్టులో ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. కాఫీ ప్రియులు నిరభ్యంతరంగా కాఫీ తాగొచ్చని, అది మీ ఆయుష్షును కూడా పెంచుతుందని చెప్పారు. అయితే ఈ కాఫీలో చిన్న మార్పు చేశారు. అదేంటో చూద్దాం..

అదేంటంటే.. రోజూ మీరు తాగే మిల్క్‌, షుగర్‌ కలిపిన కాఫీ కాకుండా బ్లాక్‌ కాఫీ తాగాలని సూచించారు. అది కూడా రోజుకి ఒకటి రెండు కప్పులు మాత్రమే తాగాలి. ఇలా బ్లాక్‌ కాఫీ తాగేవారికి వివిధ ఆరోగ్య సమస్యల వల్ల సంభవించే మరణ ముప్పు 14 శాతం తగ్గుతుందని అమెరికాలోని టఫ్ట్స్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. కాఫీ డికాక్షన్‌కు అదనంగా పాలు, చక్కెర కలిపితే దాని ప్రయోజనం తగ్గిపోతుందని వీరి కొత్త అధ్యయనం పేర్కొంటోంది. కాఫీలోని బయోయాక్టివ్‌ రసాయనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరీ ఎక్కువ చక్కెర, చిక్కని పాలు కలిపితే ఉపయోగం ఉండదని ‘జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌’లో ప్రచురితమైన ఈ అధ్యయన సీనియర్‌ రచయిత ఫాంగ్‌ ఫాంగ్‌ జాంగ్‌ తెలిపారు. 1999-2018 మధ్య అమెరికాలో నమోదైన మరణాలను ఈ అధ్యయనం కోసం పరిశీలించారు. 20 ఏళ్లు పైబడిన 46,000 మందిని ఇంటర్వ్యూ చేశారు. బ్లాక్‌కాఫీ రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ తాగితే మాత్రం ఆరోగ్య ప్రయోజనం ఉండదని అధ్యయనం స్పష్టం చేసింది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *