కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIC).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో అసిస్టెంట్ ఇంజినీర్స్ (ఏఈ- సివిల్ & ఎలక్ట్రికల్), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏఏఓ- స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 491 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ముగింపు గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
పోస్టుల వివరాలు ఇవే..
అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులు: 81
- ఇందులో ఏఈ (సివిల్) పోస్టులు 50, ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులు 31 ఉన్నాయి
- కేటగిరీ వారీగా చూస్తే.. ఎస్సీ విభాగంలో 12, ఎస్టీ విభాగంలో 6, ఓబీసీ విభాగంలో 21, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 21, యూఆర్ విభాగంలో 34 పోస్టులు ఉన్నాయి.
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏఏఓ-స్పెషలిస్ట్) పోస్టులు: 410
- ఇందులో ఏఏఓ (సీఏ) పోస్టులు 30, ఏఏఓ (సీఎస్) పోస్టులు 10, ఏఏఓ (యాక్యూరియల్) పోస్టులు 30, ఏఏఓ (ఇన్యూరెన్స్ స్పెషలిస్ట్) పోస్టులు 310, ఏఏఓ (లీగల్) పోస్టులు 30
- కేటగిరీ వారీగా చూస్తే.. ఎస్సీ విభాగంలో 58, ఎస్టీ విభాగంలో 29, ఓబీసీ విభాగంలో 100, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 44, యూఆర్ విభాగంలో 179 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, లా డిగ్రీ, సీఏ, ఐసీఏఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పోస్టుకు ఉద్యోగానుభవంతోపాటు ఐసీఎస్‌ఐ మెంబర్‌షిప్ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్ట్ 01, 2025 నాటికి ఏఈ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఏఏఓ సీఏ, లీగల్ పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులకు ఐదేళ్ల చొప్పున వయోసడలింపు వర్తిస్తుంది.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్ట్ 16, 2025 నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్ 8, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.85 + జీఎస్‌టీ, ఇతరులు రూ.700 + జీఎస్‌టీ చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 03, 2025వ తేదీన, మెయిన్ పరీక్ష నవంబర్ 08, 2025వ తేదీన ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.88,635 నుంచి రూ.1,69,025 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
ఇవి కూడా చదవండి
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.