ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న కోట శ్రీనివాసరావు.. ఇవాళ తెల్లవారుజామున 4గంటలకు తుదిశ్వాస విడిచారు. 750కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. ఇక కోట శ్రీనివాసరావు మృతిపై సినీ ప్రముఖుల సంతాపం వ్యక్తం చేశారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావుకు.. బాల్యం నుంచే నాటకాలంటే చాలా ఆసక్తి ఉంది. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేశారాయన. కాగా, ఇవాళే కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరగనున్నాయి. మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబీకులు.