40 ఏళ్ల సినీ ప్రస్థానంలోసుమారు 750కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు కోట శ్రీనివాసరావు. తన అద్బుతమైన నటనతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. కళామతల్లికి కోట అందించిన సేవలకు ప్రతీకగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను గౌరవించింది. అలాగే కోట నటనా ప్రతిభకు ప్రతీకగా తొమ్మిది నంది అవార్డులు దక్కాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. కోట శ్రీనివాసరావుకు 1966లో రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. అయితే 2010 జూన్ 21న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కోట ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఇద్దరూ కూతుళ్లకు పెళ్లిళ్లు అయి పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్ లోనే ఉన్నారని సమాచారం. అయితే కోట శ్రీనివాసరావుకు ఒక తమ్ముడు కూడా ఉన్నారని, ఆయన కూడా తెలుగులో ప్రముఖ నటుడని చాలా మందికి తెలియదు. ఆయన పేరు కోట శంకర్రావు. అన్నతోనే సినిమా కెరీర్ స్టార్ట్ చేశారు కోట శంకర్రావు. చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిశాడు.
ప్రాణం ఖరీదు సినిమా తర్వాత కోట శంకర ప్రసాద్ చాలా ఏళ్ల వరకు వెండితెరపై కనిపించలేదు. సుమారు 34 ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ మాజీ మంత్రి రసమయి బాలకృష్ణ తెరకెక్కించిన జై తెలంగాణ అనే సినిమాలో నటించారు. అలాగే ఆర్.నారాయణ మూర్తి దర్శకత్వం వహించిన పీపుల్స్ వార్ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమా కోట శంకర ప్రసాద్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. వీటితో పాటు యుగానికి ఒక ప్రేమికుడు, లవ్ అంటే, లవ్ ఇడియట్స్, వీడా, మిస్టర్ మనీ తదితర సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాల్లో నటించి మెప్పించారు కోట శంకర్రావు. కొన్ని సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశారు. అయితే గత కొన్నాళ్లుగా కోట శంకర్ రావు సినిమాలతో పాటు బయట కూడా ఎక్కువగా కనిపించట్లేదు. వయోభారంతో ఆయన కూడా సినిమాలకు దూరమయ్యారని తెలుస్తోంది.
కోట శ్రీనివాసరావు అంత్య క్రియల్లో కోట శంకర్రావు..

Kota Shankar
కోట శ్రీనివాసరావు అంత్యక్రియలకు కోట శంకర్ రావు హాజరయ్యారు. అన్నయ్యకు నివాళులు అర్పించి దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. దీంతో కోట శంకర్ రావు కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి
.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..