Kingdom Pre Release Event: కింగ్‏డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు ఎక్కడంటే..

Kingdom Pre Release Event: కింగ్‏డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు ఎక్కడంటే..


విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కింగ్‏డమ్. ఇందులో భాగ్యశ్రీ బోర్సె, సత్యదేవ్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‏‏టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్‏తో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఇప్పటికే కింగ్‏డమ్ బాయ్స్ అంటూ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితోపాటు విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కలిసి ఒక పాడ్ కాస్ట్ విడుదల చేశారు. ఇక ఇటీవల తిరుపతిలో ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు.

ఇక తాజాగా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన అప్డేట్ పంచుకున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 28న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్టెట్ తో నిర్మించారు. చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో పూర్తిగా మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు విజయ్. ఇక విడుదలకు ముందే ట్రైలర్ తో ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ మోత మోగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి:  Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..

కింగ్ డమ్ సినిమా మా రెండున్నరేళ్ల కష్టమని అన్నారు నిర్మాత నాగవంశీ. జెర్సీ సినిమా తర్వాత గౌతమ్ ఐదేళ్ల నుంచి కష్టపడి రాసిన కథ ఇది.. రెండున్నరేళ్ల నుంచి ప్రొడక్షన్ లో ఉందని.. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్ స్టర్ సినిమాను చూపించబోతున్నామని అన్నారు. దీంతో కింగ్ డమ్ సినిమాపై మరింత హైప్ పెరిగింది.

Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *