
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ త్వరలో తల్లి కానుంది. ఈ శుభవార్తను ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేయడం ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. పేరెంట్స్ కాబోతున్నాం అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కియారా, సిద్ధార్థ్ దంపతులకు సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ స్టార్ కపుల్ వివాహం ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లో చాలా వైభవంగా జరిగింది. ‘షేర్షా’ సినిమా సెట్స్‌లో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. మొన్నీమద్యే ఈ ఇద్దరూ తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. రెండేళ్ల పెళ్లయిన తర్వాత కియారా శుభవార్త చెప్పింది.
కియారా, సిద్ధార్థ్ తొలిసారి ‘లస్ట్ స్టోరీస్’ సినిమా ముగింపు పార్టీలో కలిశారు. ఈ పరిచయం మొదట స్నేహంగా, ఆ తర్వాత క్రమంగా ప్రేమగా మారింది. 2019 లో, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత 2021లో, కియారా , సిద్ధార్థ్ ఒకరి కుటుంబాలను ఒకరు కలుసుకున్నారు. ఫైనల్ గా 2023లో పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కియారా నిండు గర్భిణీ.. ఇటీవల జరిగిన మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ 2025 లో కియార బేబీ బంప్ తో హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కియారా అద్వానీకి బేబీ పుట్టింది అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫొటోల్లో కియారా బెడ్ పై పడుకొని బేబీని తనపై పెట్టుకున్నట్టు ఉంది. అంతే కాదు పక్కనే ఆమె భర్త సిద్దార్థ్ మల్హోత్ర కూడా ఉన్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కియారా అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిందా.? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఫోటోలు నిజం కాదు అని.. అవి ఎడిట్ చేసిన ఫోటోలు అని కొందరు అభిమానులు కొట్టిపారేస్తున్నారు. మరికొంతమంది నిజం తెలియక ఈ ఫోటోలను షేర్ చేస్తూ కియారా, సిద్దార్థ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.