Kerala Style Jackfruit Recipe: ఈ పనస గింజల కూర.. మటన్ కర్రీని రీప్లేస్ చేస్తుంది..! రుచి అద్భుతంగా ఉంటుంది..!

Kerala Style Jackfruit Recipe: ఈ పనస గింజల కూర.. మటన్ కర్రీని రీప్లేస్ చేస్తుంది..! రుచి అద్భుతంగా ఉంటుంది..!


కేరళ స్టైల్ జాక్‌ ఫ్రూట్ గింజల కూర. మటన్ కూరను మరిపించే వెజిటేరియన్ స్పెషల్. ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ వంటి టిఫిన్‌ లలోకి అద్భుతంగా సరిపోయే కేరళ స్టైల్ జాక్‌ ఫ్రూట్ గింజల కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇది మాంసాహారం తినని వారికి కూడా మటన్ కూర తిన్న అనుభూతిని ఇస్తుంది.

కావాల్సిన పదార్థాలు

  • బాగా ఉడికించిన పనస గింజలు
  • పెద్ద ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినవి)
  • టమోటా – 1 (ముద్దగా చేసుకోవాలి)
  • చిన్న ఉల్లిపాయలు – కొన్ని (వేరుగా వేయించడానికి)
  • ఉప్పు – రుచికి సరిపడా
  • నూనె – తగినంత
  • ఎండుమిర్చి – 2-3
  • దాల్చిన చెక్క – చిన్న ముక్క
  • లవంగాలు – 2-3
  • సోంపు – 1/2 టీస్పూన్
  • జీలకర్ర – 1/2 టీస్పూన్
  • గసగసాలు – 1 టీస్పూన్
  • బిర్యానీ మసాలా – 1 టీస్పూన్
  • కరివేపాకు – కొద్దిగా
  • బాగా ఉడికించిన ఆలుగడ్డ – 1
  • తురిమిన కొబ్బరి – 2 టేబుల్ స్పూన్లు
  • కొత్తిమీర – గార్నిష్ కోసం

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్‌ లో పనస గింజలను 10 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టాలి. తర్వాత ఒక పాన్‌ లో దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, జీలకర్ర, గసగసాలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌ లో కొద్దిగా నూనె వేసి చిన్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, తురిమిన కొబ్బరి వేసి బాగా వేయించి చల్లార్చుకోవాలి.

ఇప్పుడు వేయించిన మసాలాలు, కొబ్బరి-ఉల్లిపాయ మిశ్రమాన్ని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక తాలింపు సిద్ధం చేసుకోవాలి. తాలింపులో బిర్యానీ మసాలా వేసి కొద్దిగా వేపిన తర్వాత తరిగిన పెద్ద ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత టమోటా ముద్ద, పసుపు, ఉప్పు, ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ ను కలిపి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి.

మసాలా బాగా ఉడికిన తర్వాత సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత ఉడికించిన పనస గింజలను కలపాలి. ఈ దశలో ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు కూడా కలుపుకోవచ్చు (ఆలుగడ్డ వేయడం వల్ల కూర చిక్కబడుతుంది). అన్నిటి రుచులు బాగా కలిసేలా మరికొంత సేపు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టౌవ్ ఆఫ్ చేయండి. కమ్మని కేరళ స్టైల్ జాక్‌ ఫ్రూట్ గింజల కూర సిద్ధమైంది. ఈ వెజిటేరియన్ కూరకు మటన్ కూరలాంటి రుచి, టెక్స్చర్ ఉంటాయి. మాంసాహారం తినే వారు కూడా దీన్ని చాలా ఇష్టపడతారు. మీరు
కూడా ఈ రెసిపీని ఇంట్లో ప్రయత్నించి చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *