సినీతారల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా హీరోహీరోయిన్స్ ప్రేమ, పెళ్లి, డివోర్స్.. ఇలా వారికి సంబంధించిన పర్సనల్ విషయాలు నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. త్వరలోనే ఆ స్టార్స్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంటుంది. తాజాగా సన్ రైజర్స్ టీమ్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి గురించి నెట్టింట తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాక్ నడుస్తుంది. దీంతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కావ్య మారన్, అనిరుధ్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా వీటిపై అనిరుధ్ స్పందించారు.
సోషల్ మీడియాలో కావ్య మారన్ తో తన పెళ్లంటూ వస్తున్న వార్తలపై అనిరుధ్ స్పందించారు. “పెళ్లా.. ? జస్ట్ చిల్ అవుట్ గాయ్స్.. రూమర్స్ ప్రచారం చేయడం ఆపండి” అంటూ ట్వీట్ చేశారు. దీంతో కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. కావ్య మారన్ విషయానికి వస్తే.. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. ఐపీఎళ్ మ్యాచ్ సమయంలో మైదానంలో తనదైన హావభావాలతో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె కళానిధి వ్యాపారాలను చూసుకుంటున్నారు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. కళానిధి మారన్ నిర్మాతగా కొనసాగుతున్నారు. జైలర్, బీస్ట్, రాయన్ చిత్రాలను నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అనిరుధ్ రవిచంద్రన్ పెళ్లి గురించి రూమర్స్ రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో హీరోయిన్ కీర్తి సురేష్ తో సైతం అనిరుధ్ ప్రేమలో ఉన్నాడని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ నడిచింది. అంతకుముందు హీరోయిన్ ఆండ్రియాతో అనిరుధ్ ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కావ్య మారన్ తో ప్రేమ, పెళ్లి అనే వార్తలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ట్వీట్..
Marriage ah? lol .. Chill out guys 😃 pls stop spreading rumours 🙏🏻
— Anirudh Ravichander (@anirudhofficial) June 14, 2025
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..