Kannappa: ‘కన్నప్ప’ సినిమాను మిస్ చేసుకున్నఆ స్టార్ హీరోయిన్ చెల్లి.. షూట్ ప్రారంభమయ్యాక గుడ్ బై.. ఎందుకంటే?

Kannappa: ‘కన్నప్ప’ సినిమాను మిస్ చేసుకున్నఆ స్టార్ హీరోయిన్ చెల్లి.. షూట్ ప్రారంభమయ్యాక గుడ్ బై.. ఎందుకంటే?


మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూవస్తోన్న ఈ డివోషనల్ డ్రామా శుక్రవారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్లలోనూ కన్నప్ప సినిమా దుమ్ము దులుపుతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమాకు 45 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు ఆదివారం కావడంతో కన్నప్ప వసూల్లు మరింత పెరిగే అవకాశముంది. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు నటన, ప్రభాస్ రోల్ బాగా హైలెట్ అయ్యాయంటున్నారు ప్రేక్షకులు. అలాగే ఇదే సినిమాలో మంచు విష్ణు జోడీగా నటించిన యంగ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ కూడా తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ‘నెమలి’ అనే రాకుమార్తె పాత్రలో కట్టిపడేసింది.
ఇది ప్రీతికి రెండో తెలుగు సినిమా. గతంలో శ్రీ విష్ణు నటించిన ఓం భీమ్ బుష్ సినిమాలో హీరోయిన్ గా నటించిందీ ముద్దుగుమ్మ.

కాగా కన్నప్ప సినిమాలో మొదటగా హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లి నపూర్ సనన్ ని అనుకున్నారు. ఆమె తోనే పూజా కార్యక్రమాలు, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. అయితే ఉన్నట్లుండి కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆ అవకాశం ప్రీతి ముకుందన్ కి దక్కింది . ఈ సినిమాలో రాకుమార్తె నెమలి పాత్రలో ప్రీతి నటన బాగుందంటున్నారు ఆడియెన్స్.

ఇవి కూడా చదవండి

బాలీవుడో లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న నుపుర్ సనన్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. రవితేజ సరసన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైందీ అందాల తార. ఇక హిందీలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

కన్నప్ప సినిమాలో మంచు విష్ణు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *