Kaleshwaram Commission: నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్‌..

Kaleshwaram Commission: నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్‌..


ఇవాళ కాళేశ్వరం కమిషన్‌ ముందుకు వెళ్లనున్నారు ఈటల రాజేందర్. ఉదయం 10గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్నారు ఈటల. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈటలను ప్రశ్నించనున్నారు. ఆర్థిక అంశాలపై ఈటలను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనుంది కమిషన్‌. NDSA నివేదిక ఆధారంగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని సమాచారం. డిజైన్‌-నాణ్యత లోపాలు, అవకతవకలపై ప్రధానంగా విచారణ జరగనుంది.

బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఉన్న కమిషన్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు..ఈటల రాజేందర్‌. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ కీలక కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై కమిషన్‌ ఆరా తీయనుంది. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీలకు ఈటల నేతృత్వం వహించగా..మరికొన్ని కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఈ వ్యవహారాల్లో ఈటల పాత్రపై కమిషన్‌ ప్రశ్నించనుంది. కమిషన్‌ ఎదుట ఈటల ఇవ్వనున్న వాంగ్మూలం విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కమిషన్‌ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈటల రాజేందర్‌ విచారణ అనంతరం..ఈ నెల 9న మాజీ మంత్రి హరీశ్‌రావు, 11న మాజీ సీఎం కేసీఆర్‌ను కమిషన్‌ ప్రశ్నించనుంది. కాగా, నేడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్న ఈటల ఏం చెప్పబోతున్నారు అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *