ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నారు తారక్. దేవర సినిమా సూపర్ సక్సెస్ కావడంతో రెట్టింపు స్పీడు కనబరుస్తున్నారు. రీసెంట్గా వార్2 షూటింగ్‌ని కంప్లీట్ చేశారు.
ఏదో వెళ్లామా? చేశామా? అన్నట్టు కాకుండా.. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. హృతిక్ ఏ ప్లేస్‌కి వెళ్లినా తారక్ మంత్రాన్ని జపిస్తూనే ఉండటం చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది.
వార్2 అలా కంప్లీట్ కాగానే, నీల్ సెట్స్ లో వాలిపోయారు తారక్. అత్యంత భారీగా ఎన్టీఆర్ మూవీని ప్లాన్ చేశారు నీల్. నెవర్ బిఫోర్ అన్నట్టు ఉంటుందట. ఓ వైపు నీల్ సినిమా చేస్తూనే మరోవైపు కొరటాలతో టచ్‌లో ఉన్నారు యంగ్ టైగర్.
దేవర సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ ని ఆల్రెడీ లాక్ చేసేశారట కొరటాల. దానికి తగ్గట్టుగానే యానిమేషన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారని టాక్. ఈ ఏడాది నవంబర్ నుంచి దేవర సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది.
రీసెంట్ గా జపాన్‌లో దేవర రిలీజ్ అయినప్పుడు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రమోషన్లలో పాల్గొన్నారు తారక్. దీన్ని బట్టి, సీక్వెల్ స్క్రిప్ట్ ఎంత బాగా వచ్చిందో అర్థమవుతూనే ఉందంటూ హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్.