Jasprit Bumrah Video: 6, 7 సార్లు ఔట్ అయ్యేవాడు.. ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిపడేసిన బుమ్రా

Jasprit Bumrah Video: 6, 7 సార్లు ఔట్ అయ్యేవాడు.. ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిపడేసిన బుమ్రా


Jasprit Bumrah Breaks Silence on Sam Konstas: ఆస్ట్రేలియా బ్యాటింగ్ సంచలనం సామ్ కాన్స్టాన్స్ విషయంలో జస్ప్రీత్ బుమ్రా మౌనం వీడాడు. కాన్స్టాన్స్ తుఫాను ఇన్నింగ్స్‌తోపాటు అతను కొట్టిన సిక్సర్ల గురించి తన స్పందనను తెలిపాడు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో మొదటి రోజు కాన్‌స్టస్ 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రాపై 2 సిక్సర్లు బాదాడు. మూడో రోజు ఆటలో ఇదే విషయంపై బుమ్రాను ప్రశ్నించాడు. ఈ 19 ఏళ్ల యువ ఓపెనర్‌కు వ్యతిరేకంగా బౌలింగ్ చేయడంలో అతనికి ఇబ్బంది ఉందా అని అడిగారు. దీనిపై బుమ్రా ఆస్ట్రేలియా మీడియాకు ఘాటుగా సమాధానమిచ్చాడు.

కాన్స్టస్ గురించి బుమ్రా ఏం చెప్పాడంటే?

మూడో రోజు ఆటలో జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియన్ ఛానల్ 7 క్రికెట్‌తో మాట్లాడాడు. ఈ సమయంలో, కాన్స్టాన్స్ ఇబ్బంది పెట్టాడా, అతనికి బౌలింగ్ చేయడంలో ఇబ్బంది పడ్డారా అంటూ ఓ ప్రశ్న అడిగారు. దీనిపై బుమ్రా వెంటనే ధీటుగా సమాధానమిచ్చాడు. టీ20లో నాకు చాలా అనుభవం ఉంది. నేను గత 12 సంవత్సరాలుగా ఈ ఫార్మాట్‌లో ఆడుతున్నాను. చాలా ఆసక్తికరమైన బ్యాట్స్‌మెన్‌లను ఎదుర్కొన్నాను. అతని వికెట్ తీయడానికి నేను దూరంగా ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదు. వాస్తవానికి, అతను మొదటి రెండు ఓవర్లలో 6-7 సార్లు ఔట్ అయ్యేవాడు. అయితే క్రికెట్ అంటే ఇలాగే ఉంటుందన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు విజయం సాధిస్తే, మరికొన్ని రోజులు ఫెయిల్ అవుతుంటాం. నేను విభిన్న సవాళ్లను ఇష్టపడుతుంటాను’ అంటూ దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చి పడేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఆస్ట్రేలియా పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతని ప్రదర్శనపై ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘నాకు ఎలాంటి తేడా లేదు. నేను బాగానే ఉన్నాను. ఫలితాలు నాకు అనుకూలంగా వచ్చాయి. అయితే ఇంతకుముందు కూడా నేను వివిధ చోట్ల బాగా బౌలింగ్ చేశాను. క్రికెట్‌లో ఇలాగే ఉంటుందని చెప్పలేం. కొన్నిసార్లు మన ప్లాన్స్ సక్రమంగా పనిచేయకపోయినా విజయం సాధించే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా వికెట్లు దక్కవు’ అంటూ చెప్పుకొచ్చాడు.

బుమ్రా vs కాన్స్టాస్..

బుమ్రా బౌలింగ్‌లో సామ్ కాన్స్టాస్ 33 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అతను ఒక ఓవర్‌లో 18 పరుగులు చేశాడు. ఇది బుమ్రా టెస్ట్ కెరీర్‌లో అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిరూపితమైంది. కాన్స్టాస్ రెండు సిక్సర్లు కొట్టాడు. జోస్ బట్లర్ తర్వాత టెస్టుల్లో బుమ్రాపై ఇలా చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 3 సంవత్సరాల 4483 బంతుల తర్వాత బుమ్రా వేసిన ఓ ఓవర్లో సిక్సర్లు వచ్చాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *