ఫ్రాన్స్ వేదికగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. మే 13న ప్రారంభమైన ఈ ఈవెంట్ లో ఐశ్వర్యా రాయ్, ఊర్వశి రౌతెలా, దిశా మదన్ తదితర భారతీయ ముద్దుగుమ్మలు తళుక్కుమన్నారు. రెడ్ కార్పెట్ పై నడిచి కెమెరాలకు పోజులిచ్చారు. తాజాగా బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది. ఈ సందదర్భంగా లేత గులాబీ పొడవాటి గౌన్‌ను ధరించిన ఆమె రెడ్ కార్పెట్‌పై హొయలొలికించింది. తన స్టైలిష్ అండ్ ట్రెడిషినల్ లుక్ తో తన తల్లి శ్రీదేవిని గుర్తుచేసింది. అలాగే భారతీయ సంప్రదాయాన్ని చాటి చెప్పింది. ప్రస్తుతం కేన్స్ లో జాన్వీ కపూర్ లుక్ కు సంబంధించిన ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో జాన్వీ ప్రధాన పాత్రలో నటించిన ‘హోమ్‌బౌండ్’ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కు ఎంపికైంది. ఈ క్రమంలోనే జాన్వీతో పాటు ఈమూవీలో నటించిన
ఇషాన్ ఖట్టర్ , విశాల్ జెత్వా కూడా ఈ ఈవెంట్ లో తళుక్కుమన్నారు. అలాగే దర్శకుడు నీరజ్ ఘయ్వాన్, నిర్మాత కరణ్ జోహార్ కూడా రెడ్ కార్పెట్ పై నడిచి కెమెరాలకు పోజులిచ్చారు.
ఇవి కూడా చదవండి
కాగా ఈ ఈవెంట్ లో పొడవాటి గౌన్ తో జాన్వీ కపూర్ కాస్త ఇబ్బందులు పడింది. ఈ విషయం తెలుసుకున్న
దర్శకుడు నీరజ్, నటుడు ఇషాన్ ఖట్టర్ జాన్వీ దుస్తులను మోస్తూ సాయం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. కాగా జాన్వీ ధరించిన గౌను కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన ఈ మెటాలిక్ పింక్ గౌను కోసం 3.4 లక్షలు ఖర్చయిందని తెలుస్తోంది.
కేన్స్ లో జాన్వీ కపూర్.. వీడియో..
Janhvi Kapoor at Cannes film festival 👀 pic.twitter.com/zY1TTYNNNa
— Jeet (@JeetN25) May 20, 2025
నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రంలో జాన్వి, ఇషాన్, విశాల్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రానికి మార్టిన్ స్కోర్సెస్ నిర్మాత. అందువలన, ఈ చిత్రం అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు అందుకుంటోంది.
మోడ్రన్ అండ్ ట్రెడిషినల్ లుక్ లో జాన్వీ కపూర్.. ఫొటోస్ వైరల్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి