బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలున్నాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు. బెల్లం తినడం వల‌్ల రక్తహీనత తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజూ బెలం తినడం వల‌్ల నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. వంటకాల్లో బెల్లం వినియోగించి ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.