IPL 2025 Points Table: వర్షంతో మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ నుంచి కోల్‌కతా ఔట్.. అగ్రస్థానానికి బెంగళూరు

IPL 2025 Points Table: వర్షంతో మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ నుంచి కోల్‌కతా ఔట్.. అగ్రస్థానానికి బెంగళూరు


IPL 2025 Playoff Scenario: వారం రోజుల గ్యాప్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మళ్ళీ ప్రారంభమైంది. కానీ వర్షం కారణంగా తొలి మ్యాచ్ పూర్తిగా రద్దు చేశారు. మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. కాగా ఆర్‌సీబీ జట్టు దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే. అయితే, ఆర్‌సీబీ జట్టు తన తదుపరి మ్యాచ్‌లో గెలిచినప్పుడు మాత్రమే దానిని కైవసం చేసుకుంటుంది. ఈ (RCB vs KKR) మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, మ్యాచ్ ప్రారంభం నుంచి వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో చివరకు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేశారు.

ఆర్‌సిబి నంబర్ వన్ స్థానం..

మ్యాచ్ రద్దు తర్వాత ఆర్‌సీబీ జట్టు లాభపడింది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు మొత్తం 12 మ్యాచ్‌లు ఆడింది. అందులో 8 గెలిచి మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. బెంగళూరు రన్ రేట్ 17 పాయింట్లతో ప్లస్ 0.482గా నిలిచింది. RCB ప్లేఆఫ్స్‌కు చేరుకునే పూర్తి అవకాశాలున్నాయి. ప్రస్తుత సీజన్‌లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో బెంగళూరు మంచి ప్రదర్శన ఇస్తోంది.

ఇవి కూడా చదవండి

గుజరాత్ టైటాన్స్ ఎక్కడంటే..

కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ మధ్య మ్యాచ్ రద్దు అయిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఒక స్థానం కోల్పోయింది. దీంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానం నుంచి రెండవ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్‌లు గెలిచి, 16 పాయింట్లతో నికర రన్ రేట్ 0.793గా నిలిచింది.

కేకేఆర్‌తో సహా నాలుగు జట్లు ఔట్..

ఆర్‌సీబీతో మ్యాచ్ రద్దు కావడంతో, ప్రస్తుత సీజన్‌లో టైటిల్ గెలవాలనే కోల్‌కతా నైట్ రైడర్స్ ఆశలు ఆవిరైపోయాయి. ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అజింక్య రహానె కెప్టెన్సీలో కోల్‌కతా జట్టు బాగా రాణించలేకపోయింది. ఆ జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో మొత్తం 5 గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేకేఆర్ నికర రన్ రేట్ 0.193గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. దీనికి ముందు, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా పేలవ ఆట తీరుతో ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్నాయి.

పంజాబ్ కింగ్స్ జట్టు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో, ముంబై ఇండియన్స్ ప్రస్తుతం 14 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 13 పాయింట్లు, లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్లతో ఉన్నాయి. ఈ నాలుగు జట్లు ఇంకా ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *