Headlines

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్.. సెహ్వాగ్ మాట నిజమయ్యేనా?

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్.. సెహ్వాగ్ మాట నిజమయ్యేనా?


IPL 2025 Points Table Updated After RCB vs GT: ఐపీఎల్ (IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, సొంత మైదానంలో ఆడిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆర్‌సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మహ్మద్ సిరాజ్, ఆర్ సాయి కిషోర్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీని 169 పరుగులకే పరిమితం చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ 40 బంతుల్లో 54 పరుగులు చేశాడు. గత సీజన్ వరకు ఆర్‌సీబీ తరపున సిరాజ్.. ఇప్పుడు ఆర్‌సీబీకి వ్యతిరేఖంగా బరిలోకి దిగి 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. దీనికి ప్రతిస్పందనగా, జోస్ బట్లర్ హాస్ సెంచరీతో గుజరాత్ 18వ ఓవర్లలోనే మ్యాచ్ గెలిచింది. ఈ ఇంగ్లండ్ వికెట్ కీపర్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనితో పాటు, సాయి సుదర్శన్ 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

అయితే, ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అగ్రస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క ఓటమితో ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. పంజాబ్ టీం అగ్రస్థానంలో నిలిచింది. ఇక గుజరాత్ టీం 4వ స్థానంలో నిలిచింది. అయితే, సెహ్వాగ్ అన్నట్లుగా ఆర్‌సీబీ అగ్రస్థానం కొన్ని రోజులే, ఇప్పడే ఫొటో తీసి పెట్టుకోండన్నట్లుగానే జరిగేలా ఉందా లేదా అనేది కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

IPL 2025 పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది?

ఇవి కూడా చదవండి

1) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 2, ఓడినవి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – 1.485)

2) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 2, ఓటమి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – 1.320)

3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 2, ఓడినవి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 1.149)

4) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 2, ఓడినవి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – 0.807)

5) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 0.309)

6) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – – 0.150)

7) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -0.771)

8) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -0.871)

9) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -1.112)

10) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -1.428).

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *