మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. పంజాబ్ ను చిత్తు చేసి ఆర్సీబీ మొదటి సారి ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ముగింపు వేడుకలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక సంగీత ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తన దేశ భక్తి గీతాలతో హోరెత్తించారు. శంకర్ మహదేవన్ తో పాటు ఆయన కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేవన్ కూడా ఈ వేడుకలో భాగమయ్యారు. ఈ సందర్భంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రశంసిస్తూ శంకర్ మహదేవన్, ఆయన బృందం ఆలపించిన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. దీనికి తోడు నృత్యకారులు ‘త్రివర్ణ థీమ్’ దుస్తులు ధరించి చేసిన ప్రదర్శన కూడా ఆహుతులను ఆకట్టుకుంది. ఏ వతన్ మేరే వతన్, కంధోన్ సే మిల్తే కదమ్, యే దేశ్ హై వీ జవానో కా, లెహ్రా దో, సబ్సే ఆగే హోంగే హిందుస్తానీ, మా తుజే సలామ్‌తో తదితర దేశ భక్తి గీతాలతో నరేంద్ర మోడీ స్టేడియం దద్దరిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
అంతకుముందు కూడా , శంకర్ మహదేవన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. ‘ అహ్మదాబాద్‌లో జరిగే @iplt20 ఫైనల్స్‌లో సాయుధ దళాల తరపున ప్రదర్శన ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. సాయుధ దళాలకు మా సంగీతం ద్వారా నీరాజనాలు అందించనున్నాం. నా తోటి భారతీయులారా.. వారికి ప్రేమ, గౌరవాన్ని అందించడంలో మీరు మాతో చేరండి!! జై హింద్ .. ఖచ్చితంగా ఉత్తమ జట్టు గెలవాలి’ అని శంకర్ మహదేవన్ రాసుకొచ్చారు.
వీడియో ఇదిగో..
Fantastic emotional tribute to armed forces @ ipl final event at narendra modi stedium by Shankar Mahadevan and sons ,shidharath and shivam mahadevan!#shankar mahadevan # emotional # music# armed forces # ipl# final pic.twitter.com/NDYoMpbSHg
— The Media Times (@themediatimes_) June 3, 2025