IPL 2025: ఆర్సీబీపై ఓటమితో మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు..! CSK కోచ్‌ మాస్‌ వార్నింగ్‌

IPL 2025: ఆర్సీబీపై ఓటమితో మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు..! CSK కోచ్‌ మాస్‌ వార్నింగ్‌


ఐపీఎల్‌ 2025లో భాగంగా శుక్రవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కేపై చెపాక్‌లో ఆర్సీబీకి ఇది రెండో విజయం మాత్రమే. అప్పుడెప్పుడో 2008లో అంటే ఐపీఎల్‌ మొదలైన తొలి ఏడాది చెపాక్‌లో సీఎస్‌కేను ఓడించింది ఆర్సీబీ. మళ్లీ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆర్సీబీ చెపాక్‌లో సీఎస్‌కేపై గెలవలేదు. ఒక విధంగా ఈ విజయం ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అయితే.. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమి తర్వాత ఆ జట్టు హెడ్‌ కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రెస్‌ కాన్ఫిరెన్స్‌కు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఫ్లెమింగ్‌ కాస్త సీరియస్‌ అయ్యాడు. ఆర్సీబీపై ఓడిపోయినంత మాత్రనా తమను తక్కువ అంచనా వేయొద్దని, చివరికి ఐపీఎల్‌ ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ ఒక మాస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

ఇంతకీ ఆ రిపోర్టర్‌ ఏం అడిగాడంటే.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరు 156 టార్గెట్‌ను ఛేజ్‌ చేశారు, ఇప్పుడు ఆర్సీబీపై కేవలం 146 పరుగులు మాత్రమే చేశారు.. ఇదే మీ ఆట తీరా? ఇంత కంటే పెద్ద స్కోర్లు చేయలేరా అంటూ ప్రశ్నించాడు. అంటే మిగతా టీములు 200, అంత కంటే పెద్ద స్కోర్లు చేస్తుంటే సీఎస్‌కే మాత్రం చిన్న చిన్న స్కోర్లకే పరిమితం అయిపోతుండటంపై అతను ప్రశ్నించాడు. దీనికి ఫ్లెమింగ్‌ కాస్త ఫీలైనట్లు ఉన్నాడు.. వెంటనే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేం ఇంత కంటే వేగంగా ఆడలేమా? అన చెబుతున్నారా? అయినా ఫస్ట్‌ బాల్‌ నుంచి హిట్టింగ్‌ చేస్తూ, లక్‌ కలిసొచ్చేలా ఆడాలా? అయినా చివరికి ఐపీఎల్‌ ట్రోఫీ ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు.

అంటే ఒక్కో మ్యాచ్‌లో వేగంగా పరుగులు చేస్తూ.. మరో మ్యాచ్‌లో తుస్సు మనేకన్నా.. నిలకడగా ఆడి కప్పు గెలవడమే తమకు ముఖ్యం అంటూ ఫ్లెమింగ్‌ పేర్కొన్నాడు. అయితే ఆర్సీబీపై ఓటమి మాత్రం సీఎస్‌కే ఆత్మవిశ్వాసాన్ని గట్టిగానే దెబ్బతీసింది. చెపాక్‌ పిచ్‌ స్పిన్‌ను అనుకూలిస్తుంది కాబట్టి.. మంచి స్పిన్నర్లో సీఎస్‌కే వాళ్ల హోం గ్రౌండ్‌లో బరిలోకి దిగుతోంది. అలానే తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించింది. కానీ, ఆర్సీబీ మాత్రం సీఎస్‌కే బలంపైనే ఎటాక్‌ చేసింది. వాళ్ల స్పిన్నర్లను టార్గెట్‌ చేసుకొని కొట్టడంతో ఏం చేయాలో సీఎస్‌కే కెప్టెన్‌కు అర్థం కాలేదు, అలా పెద్ద స్కోర్‌ చేసి.. సీఎస్‌కేకు ఛేజింగ్‌ కష్టం చేసింది ఆర్సీబీ. ఇక చెపాక్‌లో సీఎస్‌క్‌తో తర్వాత మ్యాచ్‌ ఆడబోయే టీమ్స్‌ కూడా ఇవే స్ట్రాటజీని ఫాలో అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *