iPhone 17 Pro: ఐఫోన్‌ 17 ప్రోలో కొత్త చిప్, సరికొత్త డిజైన్‌ ఉండనుందా? ఈ ఫీచర్స్‌ నిజమేనా?

iPhone 17 Pro: ఐఫోన్‌ 17 ప్రోలో కొత్త చిప్, సరికొత్త డిజైన్‌ ఉండనుందా? ఈ ఫీచర్స్‌ నిజమేనా?


ప్రతి సంవత్సరం ఆపిల్ కంపెనీ కొత్త ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తుంది. ఇది భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలలో విడుదల చేస్తుంటుంది. కంపెనీ తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను గరిష్టంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం అంటే 2024లో యాపిల్ తన సరికొత్త ఐఫోన్ 16 సిరీస్‌ని విడుదల చేసింది. ఈ సిరీస్ కింద కంపెనీ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అనే నాలుగు మోడళ్లనులను విడుదల చేసింది. ఈ నాలుగు ఐఫోన్‌లు భారతదేశంలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఐఫోన్ ప్రేమికులు తదుపరి ఐఫోన్ సిరీస్ అంటే ఐఫోన్ 17 సిరీస్ కోసం వేచి చూస్తున్నారు. ఈ సిరీస్‌ మొబైల్‌ విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్‌ ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది.

గత కొన్ని వారాల్లో iPhone 17 Pro (iPhone 16 Pro) గురించి చాలా కొత్త సమాచారం లీక్ అయ్యింది. iPhone 17 Pro గురించి ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అన్ని లీకైన నివేదికల గురించి తెలుసుకుందాం.

1. కొత్త డిజైన్:

ఐఫోన్ 17 ప్రో అల్యూమినియం ఫ్రేమ్‌ ఉండే అవకాశం కనిపిస్తోంది.ఇది గతంలో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 16 ప్రోలో టైటానియం ఫ్రేమ్‌ను ఉపయోగించింది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో గాజు, అల్యూమినియం మిశ్రమంతో కూడిన ప్యానెల్‌ను చూడవచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది. కెమెరా బంప్ పెద్దదిగా ఉంటుంది. ఇది మునుపటి మోడళ్లతో పోలిస్తే భిన్నంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

2. A19 ప్రో చిప్:

ఐఫోన్ 17 ప్రో ఆపిల్ కొత్త A19 ప్రో చిప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది TSMC 3nm సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఇది పనితీరు, శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనితో పాటు, ఆపిల్ రూపొందించిన Wi-Fi 7 చిప్‌ను కూడా చూడవచ్చు.

3. ర్యామ్‌, స్టోరేజీ:

iPhone 17 Pro, Pro Max లను 12GB RAMతో అందించవచ్చని తెలుస్తోంది. మల్టీ టాస్కింగ్, యాపిల్‌ AI-ఆధారిత ఫీచర్‌లకు మద్దతు ఇవ్వడానికి ఈ అప్‌గ్రేడ్ చేయనుంది.

4. కెమెరా:

ఐఫోన్ 17 సిరీస్‌లో ప్రధాన కెమెరా అప్‌గ్రేడ్‌ను చూడవచ్చు. ముందు కెమెరాను 12MP నుండి 24MPకి పెంచవచ్చు. అలాగే ప్రో మోడల్స్‌లో టెలిఫోటో కెమెరాను 48MPకి అప్‌గ్రేడ్ చేయవచ్చని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. కెమెరాను మరింత అప్‌గ్రేడ్‌ చేసినట్లయితే ఫోటోగ్రఫీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

5. కొత్త డైనమిక్ ఐలాండ్:

ప్రో మాక్స్ మోడల్‌లో ఒక చిన్న డైనమిక్ ఐలాండ్ అందించే అవకాశం ఉంది. స్క్రీన్-టు-బాడీని మెరుగుపరుస్తుంది. Meta Lens of Face ID సిస్టమ్‌ని ఉపయోగించడం ద్వారా ఈ మార్పు సాధ్యమవుతుంది. అయితే ఐఫోన్‌ 17 సిరీస్‌కు చెందిన ఫీచర్స్‌ ఆపిల్‌ కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేలేదు. మొత్తం లీకైన వివరాలు మాత్రమే. ఐఫోన్ 17 ప్రోకి సంబంధించి 2025లో లాంచ్ అవుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన లీకులు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం మీద ఐఫోన్‌ 16 కంటే 17లో అద్భుతమైన ఫీచర్స్‌ ఉండే అవకాశం ఉందని, గత మోడల్‌ కంటే వచ్చే మోడల్‌లో కీలక అప్‌డేట్స్‌ ఉండే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు సైతం చెబుతున్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *