Indian Railways: గత ఆరేళ్లలో రైల్వేలో ఎంత మంది ప్రయాణించారో తెలుసా..? తెలిస్తే అవాక్కే..

Indian Railways: గత ఆరేళ్లలో రైల్వేలో ఎంత మంది ప్రయాణించారో తెలుసా..? తెలిస్తే అవాక్కే..


దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతీ ఏటా కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. ఛార్జీలు తక్కువ, నమ్మకమైన వ్యవస్థ కావడంతో ప్రజలు ఎక్కువగా రైళ్ల వైపు చూస్తారు. ప్రస్తుతం దేశంలో 17 రైల్వే జోన్లు, 68 డివిజన్లు ఉన్నాయి. గత దశాబ్దంలో కేంద్రం రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. వందే భారత్, అమృత్ భారత్ వంటి ఆధునిక రైళ్లను ప్రారంభించడం, రైల్వే లైన్ల రెట్టింపు, కొత్త ట్రాక్‌ల నిర్మాణం స్టేషన్ల అభివృద్ధి మొదలైనవి చేపట్టింది. రైల్వేలో ప్రయాణించే వారి సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉంది. అయితే రైళ్ల ఆక్యుపెన్సీ ఏడాది పొడవున ఒకేలా ఉండదని.. మారుతూ ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాన మార్గాల్లో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

గత ఆరేళ్లలో రైళ్లలో ఎంత మంది ప్రయాణించారు..?

కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్.. రైలు ప్రయాణాలకు సంబంధించి కీలక అంశం లేవనెత్తారు. 2019 నుండి రైలులో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్యపై రైల్వే మంత్రిని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిచ్చారు. గత ఆరేళ్ళలో రైళ్లలో 3349 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు తెలిపారు. ఇందులో 418 కోట్ల మంది రిజర్వ్డ్, 2,931 కోట్ల మంది అన్‌రిజర్వ్డ్ క్లాస్ ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. దసరా, దీపావళి, ఛాత్ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని రైల్వే మంత్రి తెలిపారు. రద్దీకి అనుగుణంగా 2024 అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు 7,990 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు చెప్పారు. దీని ద్వారా దాదాపు 1.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించామన్నారు.

ఇటీవల ముగిసిన మహా కుంభమేళా సందర్భంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు రైల్వే మంత్రి తెలిపారు. జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు రైల్వే శాఖ 17,300 కంటే ఎక్కువ రైళ్లను నడిపిందన్నారు. ఈ సమయంలో దాదాపు 4.24 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు తెలిపారు.

ఏ సంవత్సరంలో ఎంతమంది అంటే..?

2020 – 21 – 99కోట్లు

2021 – 22 – 275 కోట్లు

2022 – 23 – 553 కోట్లు

2023 – 24 – 609 కోట్లు

2024 – 25 – 651 కోట్లు

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *