Indian Economy: ప్రగతి పథంలో దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ.. మే నెల ఎకానమీ రివ్యూ చూశారా?

Indian Economy: ప్రగతి పథంలో దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ.. మే నెల ఎకానమీ రివ్యూ చూశారా?


2026 ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రగతి సానుకూల పథంలో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ‘మే నెల ఎకనామిక్‌ సమీక్ష నివేదిక’ కేంద్ర మంత్రిత్వ శాఖ శుక్రవారం (జూన్‌ 27) విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ భారత్‌ మాత్రం పురోగతి మార్గంలో దూసుకుపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు అధిక ఫ్రీక్వెన్సీ సూచికతో దూసుకుపోతున్నట్లు సమీక్ష నివేదిక తెలిపింది. మొత్తం మీద భారత ఆర్థిక వ్యవస్థ దృక్పథం సానుకూలంగానే ఉందని తాజా నివేదిక పేర్కొంది.

బలమైన దేశీయ డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడం, స్థితిస్థాపక బాహ్య రంగం, స్థిరమైన ఉపాధి అవకాశాలు.. వెరసి దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతకు ఘననీయంగా దోహదపడ్డాయి. ప్రారంభ హై-ఫ్రీక్వెన్సీ సూచికలు (HFI) ఆర్థిక కార్యకలాపాలు స్థితిస్థాపకంగా ఉన్నాయని రివ్యూ సూచిస్తుంది. ఇ-వే బిల్లు ఉత్పత్తి, ఇంధన వినియోగం, PMI సూచికలు వంటి HFIలు నిరంతర స్థితిస్థాపకతను సూచిస్తున్నట్లు ఆర్థిక సమీక్ష పేర్కొంది. రబీ పంటల వృద్ధి, రుతుపవనాల సానుకూలతతో గ్రామీణ డిమాండ్ మరింత బలపడింది. విమాన ప్రయాణీకుల రద్దీ, హోటల్ ఆక్యుపెన్సీ పెరుగుదలకు విరామ, బిజినెస్‌ ప్రయాణాలు పెరగడం వల్ల అర్బన్‌ వినియోగం కూడా పెరుగడం శుభసూచకం. మరోవైపు నిర్మాణ రంగ పెట్టుబడులు, వాహన అమ్మకాలు వంటి రంగాలలో తగ్గుదల సంకేతాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి, ప్రభుత్వ జోక్యం వల్ల మే 2025లో రిటైల్, ఆహార ధరల ద్రవ్యోల్బణం క్షీణతను నమోదు చేసింది. దేశీయ సూచికలు ఎక్కువగా సానుకూలంగా ఉన్నప్పటికీ, బాహ్య పరిణామాల ఫలితంగా ఆర్థిక మార్కెట్లు అస్థిరతను ఎదుర్కొన్నాయి. 2025 ప్రారంభంలో వాణిజ్య రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆ తరువాత రెండవ త్రైమాసికంలో పాక్షికంగా తగ్గుదల, ఆర్థిక మార్కెట్లలో గణనీయమైన అస్థిరతకు దోహదపడింది.

అయితే మే నెలలో భారత ప్రభుత్వ బాండ్ మార్కెట్ కాస్త నిలదొక్కుకుంది. RBI రికార్డు స్థాయిలో మిగులు డివిడెండ్ ప్రకటించడం, Q4 FY25 బలమైన వృద్ధి ఇందుక దోహదం చేసింది. తద్వారా మే 30 నాటికి దేశ ప్రభుత్వ బాండ్లపై రిస్క్ ప్రీమియం 182 బేసిస్ పాయింట్లకు దిగొచ్చింది. దేశ ఎగుమతులు మే 2025లో 2.8 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేశాయి. జూన్ 13 నాటికి విదేశీ మారక నిల్వలు 699 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇది 11.5 నెలల దిగుమతులను కవర్‌ చేస్తుంది. ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే రూపాయి మితమైన అస్థిరతను ఎదుర్కొంటున్నట్లు ఎకనామిక్‌ సమీక్ష వెల్లడించింది. వైట్ కాలర్ నియామకాలు కూడా పెరిగాయి. AI/ML నిపుణులు, బీమా, రియల్ ఎస్టేట్, BPO/ITES, హాస్పిటాలిటీ వంటి కీలక రంగాలు నియామకాల్లో ఆశాజనకంగా వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ కింద పెరుగుతున్న నికర జీతాలు.. ఉద్యోగ సృష్టి కూడా పెరుగుతున్నట్లు సమీక్ష పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *