India Passport: మరింత పవర్‌ ఫుల్‌గా మారిన ఇండియన్‌ పాస్‌పోర్ట్‌..! ఈ దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు..

India Passport: మరింత పవర్‌ ఫుల్‌గా మారిన ఇండియన్‌ పాస్‌పోర్ట్‌..! ఈ దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు..


హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. తాజా మిడ్‌ ఇయర్‌ అప్డేట్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి చేరుకుంది. పాస్‌పోర్ట్ ఉన్నవారు ముందస్తు వీసా లేకుండా ఎక్కువ దేశాలకు వెళ్లే అవకావం ఉండే పాస్‌పోర్ట్‌లకు ఈ ర్యాంకింగ్‌లు ఇస్తుంటారు. గత ఆరు నెలల్లో ఏ దేశం కూడా ఇంత మెరుగైన ర్యాంకింగ్‌ను పొందలేదు. అంటే ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకోలేదు.

ప్రస్తుతం హెన్లీ పాస్‌ఫోర్ట్‌ ఇండెక్స్‌లో 77వ స్థానంలో ఉన్న ఇండియన్‌ పాస్‌పోర్ట్‌తో మనం ఏకంగా 59 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. 77వ స్థానానికి రాకముందు 57 దేశాలకు ముందస్తు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉండేది. కాగా, 227 దేశాలకు గాను 193 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో సింగపూర్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. జపాన్, దక్షిణ కొరియా 190 దేశాలకు విత్‌ అవుట్‌ వీసా యాక్సెస్ కలిగి ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీతో సహా ఏడు EU దేశాలు మూడవ స్థానంలో నిలిచాయి. న్యూజిలాండ్, గ్రీస్, స్విట్జర్లాండ్‌తో కలిసి ఐదవ స్థానంలో ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న అమెరికా, యుకెలు తమ ర్యాంకింగ్స్‌ను కోల్పోతున్నాయి. 186 దేశాలకు వీసా లేకుండా యాక్స్‌స్‌ కలిగి యుకె ఆరవ స్థానానికి పడిపోయింది. 182 దేశాలకు యాక్సెస్‌తో యుఎస్ 10వ స్థానానికి పడిపోయింది.

ఇండెక్స్ ప్రకారం.. యుఎస్ మొదటి పది స్థానాల నుండి పూర్తిగా పడిపోయే ప్రమాదం ఇదే మొదటిసారి. యుఎఇ, చైనా, సౌదీ అరేబియా దశాబ్ద కాలంలో అతిపెద్ద మార్పులను చూస్తున్నాయి. కేవలం పదేళ్లలో 42వ స్థానం నుండి 8వ స్థానానికి ఎగబాకిన UAE ప్రత్యేకతను సంతరించుకుంది. చైనా కూడా గత దశాబ్దంలో 34 స్థానాలు పెరిగి నాటకీయంగా 2025లో 60వ స్థానానికి చేరుకుంది. దీనికి కొత్త దౌత్య వీసా మినహాయింపులు మద్దతు ఇచ్చాయి. ఐదు సంవత్సరాల క్రితం కేవలం 20 దేశాలకు పరిమితమైన చైనా ఇప్పుడు 75 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించింది. 2025 నాటికి బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలతో పాటు బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే వంటి దక్షిణ అమెరికా దేశాలకు పూర్తి వీసా రహిత యాక్సెస్ అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *