యావత్ భారతం 79వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోంది. కాసేపట్లో ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. నవభారత్ ఇతివృత్తంతో 79వ స్వాతంత్య్ర వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. మోదీ 12వ సారి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ
వేడుకల్లో 25 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. 15 వేల మంది బలగాలతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు.