IND vs ENG: ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న సిరాజ్‌.. ఓపెనర్‌ ముందు సింహ గర్జన! ఈ కోపం ఎందుకంటే..?

IND vs ENG: ఇంగ్లాండ్‌ను వణికిస్తున్న సిరాజ్‌.. ఓపెనర్‌ ముందు సింహ గర్జన! ఈ కోపం ఎందుకంటే..?


ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇరుజట్లు నువ్వానేనా అన్నట్లు విజయం కోసం పోటీ పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. టీమిండియాదే కాస్త పైచేయిలా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇంగ్లాండ్‌ బ్యాటర్లను రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అగ్రెసివ్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఇబ్బంది పెడుతున్నాడు. ఆరంభంలోనే టీమిండియాకు రెండు వికెట్లు అందించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ను అవుట్‌ చేసిన సమయంలో అయితే సిరాజ్‌ చాలా కోపంగా కనిపించాడు. వికెట్‌ తీసిన తర్వాత డకెట్‌పైకి దూసుకెళ్తూ అతని ముందుకెళ్లి కళ్లలో కళ్లు పెట్టి సింహ గర్జన చేశాడు. అయితే సిరాజ్‌ చూపించిన ఈ అగ్రెషన్‌కు అర్థముంది.

ఎందుకంటే.. ఆట మూడో రోజు టీమిండియా 387 పరుగులు చేసి ఆలౌట్‌ అయిన తర్వాత.. ఇంకా ఆట మిగిలే ఉంది. కానీ, ఇంగ్లాండ్‌ బ్యాటర్లు నటిస్తూ.. ఎక్కువ బంతులు ఎదుర్కొకుండా ఉండాలని నాటకాలు ఆడారు. బుమ్రా వేసిన ఒక్క మాత్రమే ఆడిన ఇంగ్లాండ్‌ ఓపెనర్లు.. టైమ్‌ వేస్ట్‌ చేస్తూ డ్రామాలు ఆడారు. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్లంతా ఇంగ్లాండ్‌ బ్యాటర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాల్‌ గ్లౌజుకు తగిలితే.. పెద్ద గాయం అయినట్లు నాటకాలు ఆడుతూ.. ఫిజియోని పిలిపించి జాక్‌ క్రాలే టైమ్‌ వేస్ట్‌ చేసే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో భారత ఆటగాళ్లు అతని యాక్టింగ్‌ స్కిల్స్‌ను మెచ్చుకుంటూ చప్పట్లతో అతన్ని దారుణంగా టీజ్‌ చేశారు. వికెట్లు కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్లు ఆ డ్రామా సృష్టించారు. ఇదే సిరాజ్‌కు బాగా కోపం తెప్పినట్లు ఉంది. అందుకే.. నాలుగో రోజు ఆరంభంలోనే ఇంగ్లాండ్‌ గట్టి షాక్‌ ఇచ్చాడు. బెన్‌ డకెట్‌(12)తో పాటు ఓలీ పోప్‌(4)ను అవుట్‌ చేసి.. పెవిలియన్‌ చేర్చాడు.

సిరాజ్‌ దెబ్బకు ఇంగ్లాండ్‌ కేవలం 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు సమానంగా పరుగులు చేయడంతో ఏ జట్టుకు కూడా లీడ్‌ రాలేదు. దీంతో ఇంగ్లాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌ వీలైనంత తక్కువ స్కోర్‌కు ఆలౌట్‌ చేసి.. ఆట చివరి రోజు మ్యాచ్‌ గెలవాలని టీమిండియా బౌలర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 50 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నితీష్‌ కుమార్‌ రెడ్డి జాక్‌ క్రాలే(22)ను అవుట్‌ చేసి సిరాజ్‌కు మంచి సపోర్ట్‌ అందించాడు. ప్రస్తుతానికి సిరాజ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవాలంటేనే ఇంగ్లాండ్‌ బ్యాటర్లు భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 7 ఓవర్లు వేసిన సిరాజ్‌ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అందులో రెండు మెయిడెన్‌ ఓవర్లు కూడా ఉన్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *