ఎన్నో ఆశలతో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన యంగ్ టీమిండియాకు తొలి టెస్టులోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో టీమిండియా ఓ మూడు అత్యంత చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అందులో మొదటిది ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఓ టీమ్ తరఫున ఐదు సెంచరీలు నమోదైన తర్వాత కూడా ఆ జట్టు ఓడిపోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొట్టమొదటి సారి. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ ఒక్కో సెంచరీ చేయగా, రిషభ్ పంత్ రెండు సెంచరీలు బాదాడు. మొత్తం ఐదు సెంచరీలో టీమిండియా తరఫున నమోదయ్యాయి. ఇలా ఐదు సెంచరీలు నమోదు చేసి కూడా మ్యాచ్ ఓడిన చెత్త రికార్డను టీమిండియా సొంతం చేసుకుంది.
ఇక రెండో చెత్త రికార్డ్.. 371 పరుగుల భారీ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో వాళ్లకు ఇది రెండో అతి పెద్ద ఛేజింగ్. 2022లో కూడా 378 పరుగులు సక్సెస్‌ఫుల్‌గా ఛేజ్ చేసిన రికార్డ్ కూడా మనపైనే ఉంది. ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండు అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు ఇండియాపై ఉన్నాయనే చెత్త రికార్డ్ మనకు వచ్చింది. ఇక మూడో చెత్త రికార్డ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ 9 పెద్ద టీమ్స్ తమ చివరి 9 టెస్టుల్లో ఎన్ని మ్యాచ్‌లు గెలిచాయనే లిస్ట్ తీస్తే.. అత్యంత దారుణంగా టీమిండియా ఒకే ఒక టెస్ట్ గెలిచి అట్టడుగు స్థానంలో ఉంది. అంటే టీమిండియా ఆడిన చివరి 9 టెస్టు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క టెస్ట్ మాత్రమే నెగ్గింది. టీమిండియా కంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా మెరుగ్గా ఉండటం ఇక్కడ దారుణమైన అంశం. పాకిస్థాన్ తమ చివరి 9 టెస్టుల్లో 3 గెలిస్తే, బంగ్లాదేశ్ 2 మ్యాచ్‌లు గెలిచింది. శ్రీలంక సైతం 3 గెలిచింది. వెస్టిండీస్ కూడా 2 టెస్టులు గెలిచింది.
అందరికంటే తక్కువగా టీమిండియా ఒకే ఒక టెస్ట్ గెలిచింది. అది కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని తొలి మ్యాచ్. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు గెలవలేదు. ఒక చివరి ఎనిమిది మ్యాచ్‌లు చూసుకుంటే ఒక్కటంటే ఒక్క గెలుపులేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ 3-1తో మనపై గెలిచింది, అలాగే న్యూజిలాండ్ టీమిండియా మన దేశంలో 3-0తో వైట్ వాష్ చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో తొలి టెస్ట్ ఓటమి. ఇలా చివరి 9 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయంతో టీమిండియా చివరి స్థానంలో ఉంది. ఇక ఈ టీమిండియా ఇంత దారుణ స్థితిలో ఉండేందుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, గిల్ కంటే ముందు టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మదే అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే.. గిల్‌కు ఇది తొలి టెస్ట్, ఆ 9 మ్యాచ్‌ల్లో గెలిచిన ఒక్క మ్యాచ్ కూడా బుమ్రా కెప్టెన్సీలోనే టీమిండియా గెలిచింది.
#INDvsENG #ShubmanGill #TeamIndia pic.twitter.com/tqsUIDT7tB
— Sayyad Nag Pasha (@nag_pasha) June 25, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి