Imran Hashmi: ఇమ్రాన్ హష్మీతో లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్.. ఇప్పుడు ఆ టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య..

Imran Hashmi: ఇమ్రాన్ హష్మీతో లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్.. ఇప్పుడు ఆ టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య..


సినీస్టార్స్, టీమిండియా క్రికెటర్స్ మధ్య మంచి సత్ససంబంధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత క్రికెట్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఇండస్ట్రీలోని పలువురు హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. అందులో ఓ క్రికెటర్ కూడా ఉన్నారు. అతడు బీటౌన్ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి సంతోషంగా నివసిస్తున్నాడు. ఆమె రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీతో కలిసి పలు చిత్రాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు.. గీతా బాస్రా. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ భార్య. వీరిద్దరు 2015లో వివాహం చేసుకున్నారు. పెళ్లికంటే ముందు గీతా బాస్రా సినిమాల్లో నటించేది. వీరిద్దరు ప్రేమించి.. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇంతకీ హర్బజన్ సింగ్, గీతా బస్రా ప్రేమ కథ గురించి తెలుసా.. ?

2007లో టీం ఇండియా తొలి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత గీతా బాస్రా హర్భజన్ సింగ్ కు ఫోన్ చేసి అభినందించింది. ఆ తర్వాత హర్భజన్ సింగ్ గీతను ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి ఆహ్వానించాడు. అయితే, ఆమె ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి వెళ్లలేకపోయింది. కానీ కొన్ని రోజుల్లోనే వారు ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. స్నేహం ప్రేమగా మారింది. హర్భజన్ సింగ్ గీతకు ప్రపోజ్ చేశాడు. కానీ గీత ఆ సమయంలో ప్రేమను అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. ఆమె తన కెరీర్ గురించి ఆందోళన చెందింది. కొన్ని రోజులకు హర్బజన్ సింగ్ ను వివాహం చేసుకోవడానికి అంగీకరించింది.

గీత బ్రిటన్‌లో జన్మించింది. హర్భర్జన్ సింగ్‌ను అంగీకరించాలా వద్దా అనే సందేహం నాకు ఒకప్పుడు ఉందని ఆమె తన ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. తన కెరీర్ గురించి ఆందోళన చెందానని.. అలాగే అదే సమయంలో క్రికెటర్స్ గురించి ఎన్నో రూమర్స్ విన్నానని తెలిపింది. గీతా అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ఆమె నటుడు ఇమ్రాన్ హష్మీతో ముద్దు సన్నివేశాలు కూడా చేసింది.ఇమ్రాన్ హష్మీ ది ట్రెయిన్ సినిమాలో ఆమెతో ప్రేమాయణం సాగించాడు. ఆమె అతనితో కలిసి సంగ్ దిల్ దియా హై చిత్రంలో కూడా పనిచేసింది. ఆమె పదికి పైగా చిత్రాలలో పనిచేసింది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *