Hyderabad: ఓల్డ్ సిటీలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా…

Hyderabad: ఓల్డ్ సిటీలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా…


Hyderabad: ఓల్డ్ సిటీలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా…
https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f

పాతబస్తీలో జిమ్‌కు వెళ్లే యువకులే టార్గెట్‌గా నిషేధిక ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్‌ చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు..వారి నుండి 5 లక్షల రూపాయల విలువచేసే 423 మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుండి సెల్‌ఫోన్లతో పాటు బైక్‌లు, నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు ఛత్రినాక పోలీసులు.

పాతబస్తీకి చెందిన మొహమ్మద్ జుబైర్ వృత్తి రీత్యా మోడలింగ్ చేస్తాడు. ఇతడికి ఇంజెక్షన్ తీసుకునే అలవాటు ఉంది. ఇదే క్రమంలో జుబైర్‌కు వినయ్‌ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ కలిపి ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కపిల్‌ సాయంతో హైదరాబాద్‌కు ఈ ఇంజెక్షన్ల తెప్పించారు. పాతబస్తీ యువకులను టార్గెట్ చేసి అధిక ధరలకు వీటిని విక్రయిస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderbad Old City

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *