Horoscope Today: ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (ఆగస్టు 13, 2025): మేష రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశులవారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపా రాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శత్రువులు, పోటీదార్ల మీద బాగా పైచేయి సాధిస్తారు. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు అదుపులో ఉంటాయి. ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనివ్వడం వంటివి జరుగుతాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

రోజంతా హుషారుగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయ డం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించు కుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయక పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొద్దిగా ఆరోగ్య సమస్యలు, ఇంటా బయటా ఒత్తిడి, వ్యయ ప్రయాసలు ఉండే అవకాశముంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించ వచ్చు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు సన్నిహితుల వల్ల కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కీలక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆదాయానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశముంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మంచి ఉద్యోగంలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నం సఫలం అవుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు శ్రమ, తిప్పటతో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూర గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. బంధువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. పిల్లల విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. కుటుంబ ఖర్చులు ఇబ్బంది పెడతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగి, మంచి ఆఫర్లు లభిస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *