దిన ఫలాలు (జనవరి 27, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం విశేషంగా వృద్ధి చెందే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది. మిథున రాశి వారి ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో ఒకటి రెండు సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రత్యేక బాధ్యతలతో అధికారులు బాగా ప్రోత్సహించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన విధంగా సాగిపోతాయి. ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా చక్కబడతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం చాలా మంచిది. ఉద్యోగ జీవితంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆరోగ్యం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు సంతృప్తి కరంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపుగా పదోన్నతి లభిస్తుంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. సామాజిక సేవా కార్యక్ర మాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో సహోద్యోగుల బాధ్యతలు కూడా పంచుకోవాల్సి వస్తుంది. పనిభారం వల్ల విశ్రాంతి కరవవుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా పురోగతి చెందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగి పోతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆపర్లు అందుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగులకు అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. కొద్ది ప్రయ త్నంతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం నిలక డగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక విషయాలకు, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు మారడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులు అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయ ప్రయత్నాలు మెరుగైన ఫలితాలనిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా వృద్ధి చెందుతుంది. గట్టి పట్టుదలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ సభ్యుల సాయంతో ఆర్థిక వ్యవహారాలు చక్కబెడతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సన్నిహితుల వల్ల పొరపాట్లు జరిగే అవ కాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూ లంగా సాగిపోతాయి. అదనపు ఆదాయం ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్యా నికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. కొందరు బంధువుల వల్ల ఆర్థికంగా కొద్దిగా నష్టపోతారు. ఆర్థిక విషయాల్లో వీలైనంత అప్రమత్తంగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో పని భారం, ఒత్తిడి ఎక్కువైనా ఆశించిన ఫలితం ఉంటుంది. అధికారులు బాధ్యతలను పెంచే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయ త్నాల మీద శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల మీద మరింతగా దృష్టి కేంద్రీకరిస్తారు. చేప ట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సంద ర్శిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశముంది. లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలపరంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం ఒక మోస్తరుగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న శుభ వార్తలు అందుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కొద్దిగా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కుటుంబ బాధ్యతలతో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగు తాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు.