
వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలా మంది ఎముకల బలహీనపడే సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కనీసం 40 ఏళ్లు దాటిన వారిలో ఎముకల మధ్య గుజ్జు తగ్గిపోవడం, పెలుసుగా మారడం, నడుస్తున్నప్పుడు ఎముకలు క్రాక్ అవుతున్న శబ్దాలు వంటివి కనిపించేవి. కానీ, ఇప్పుడు టీనేజీ పిల్లలో కూడా ఎముకలు స్ట్రాంగ్ గా ఉండటం లేదు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతూ ఉంటుంది. ఉదయం లేవడమే టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు, కూల్ డ్రింకులు తాగేవారిలో ఎముకలు బలహీనపడటం మొదలవుతుంది. దీనివల్ల ఆస్టియోపోరొసిస్ అనే ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అయితే, ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టే దీన్ని కూడా చాలా తేలికపాటి ఆహార నియమాలతో తగ్గించుకోవచ్చు. మళ్లీ మీ ఎముకలను ఉక్కులా తయారు చేసుకోవచ్చు.. అందుకు అవసరమయ్యే విటమిన్లు.. అవి దొరికే ఆహారాలు ఏమిటో తెలుసుకోండి..
ఎముకలు.. మునుపటిలా..
బలమైన ఎముకలను నిర్మించడానికి, పాలు, ఆకుకూరలు, బలవర్థకమైన ఆహారాలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. మంచి కొవ్వుకలిగిన పదార్థాలు, చేపలు, పాలు, రాగులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు మళ్లీ తిరిగి సాధారణ స్థితికి వస్తాయి.
కాల్షియం కోసం ఇవి తీసుకోండి..
డైరీ ఉత్పత్తులైన పాలు, పెరుగు, జున్ను వంటివి కాల్షియంను అందించడంలో అద్భుతమైన వనరులు. వీటిని రోజుకు ఒక్కసారైనా తీసుకోవడం వల్ల కూడా ఎముకలు బలంగా మారతాయి. రెండు వారాల్లోనే మీరు ఆ మార్పును గమనించవచ్చు.
తాజా కూరలు కీలకం..
తాజా కూరగాయలు అధికంగా ఉండే ఆహారం శైలిని చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయడం వల్ల యుక్తవయసు వచ్చేసరికి వారి ఎముకలు మరింత బలంగా మారుతాయి. వీటిని తీసుకోవడం ఆరోగ్యకరమైన ఎముకలు ఏర్పడతాయి. యువకులు, వృద్ధ మహిళలలో ఎముక ద్రవ్యరాశిని ఈ ఆహారం కాపాడుతుంది.
బరువులు మోస్తున్నారా?
బరువు మోసే అలవాటు ఉన్నవారిలో సాధారణంగానే ఎముకలు రాటుతేలుతాయి. రోజులో కనీసం కొంత సమయం వెయిట్ లిఫ్టింగ్ ప్రయత్నించడం వల్ల తిన్న ఆహారం ఎముకలకు పరిపూర్ణంగా అందుతుంది. ఎముక సాంద్రత తక్కువగా ఉన్నవారితో సహా వృద్ధులలో ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
తక్కువ ప్రొటీన్.. తీవ్ర నష్టం
తక్కువ ప్రోటీన్ తీసుకోవడం ఎముకల నష్టానికి దారితీస్తుంది, అయితే అధిక ప్రోటీన్ తీసుకోవడం వృద్ధాప్యం, బరువు తగ్గడం సమయంలో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
సప్లిమెంట్ల సాయం తీసుకోవచ్చు..
ఎముకలలో కనిపించే ప్రధాన ఖనిజం కాల్షియం. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తీసుకోవాలి. ఆహారం లేదా సప్లిమెంట్ల నుండి తగినంత విటమిన్ డి, కె2 పొందడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. విటమిన్ డి కోసం కాసేపు ఉదయపు ఎండలో సమయం గడపాలి.